Ntr : ఎన్‌టి‌ఆర్ రేంజ్ అదే మరి , RRR రాకముందే హిందీ బెల్ట్ లో దున్నేశాడు !

Ntr : ఎన్‌టి‌ఆర్ కెరీర్ లో జై లవ కుశ సినిమా మైన్ స్టోన్ గా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్‌టి‌ఆర్ త్రిపాత్రాభినయంతో తాత సీనియర్ ఎన్‌టి‌ఆర్ ని తలపించాడు. మూడు విభిన్నమైన పాత్రలో తారక్ టాలీవుడ్ ప్రేక్షకులనే కాదు బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం లో నందమూరి కళ్యాణ్ రాం నిర్మించిన ఈ సినిమా బ్యానర్ పేరు నిలబెట్టింది. అయితే ఈ సినిమా మళ్ళీ థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది.

ntr-that-is-his-range-and-before-the-arrival-of-rrr-he-is-succeeded-in-the-hindi-belt
ntr-that-is-his-range-and-before-the-arrival-of-rrr-he-is-succeeded-in-the-hindi-belt

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతోంది. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శక ధీరు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేసేందుకు గ్రిన్ సిగ్నల్ ఇచ్చాడు. వాస్తవంగా ఈ సినిమా సంవత్సరం లోపే రిలీజ్ అవుతుందని భావించారు. కాని భారీ తారాగాణం తో పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతుండటం తో పాటు కరోనా కారణం గా ఈ ఒక్క సినిమా కే తారక్ రెండేళ్ళు సమయం కేటాయించాల్సి వచ్చింది.

Ntr : ఎన్‌టి‌ఆర్ హిందీలో స్ట్రైట్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ..?

దాంతో ఇటివల థియేటర్స్ ఓపెన్ అవడంతో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలని మళ్ళీ థియేటర్స్ లోకి తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌టి‌ఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ సినిమాని ఈ నెల 28 న ప్రసాద్ ఐమ్యాక్స్ లో స్పెషల్ ప్రీమియర్ వెయ్యడానికి సిద్దమయ్యారు. ఈ విషయం తెలిసిన తారక్ అభిమానులు టికెట్స్ కోసం క్యూ కట్టారట. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎన్‌టి‌ఆర్ జై లవ కుశ హిందీ డబ్బింగ్ ప్రముఖ ఛానల్ లో టెలికాస్ట్ అయి రికార్డ్ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ని సాధించిందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి జై లవ కుశ తో ఎన్‌టి‌ఆర్ తనకున్న సత్తాని నిరూపించాడు. ఇక స్ట్రైట్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Advertisement