NTR : ఎన్టీఆర్ సినిమాకి ‘వెయ్యి’ షో లు.. ఈ ఫ్యాన్స్ మామూలోల్లు కాదు
NQ Staff - May 18, 2023 / 10:47 PM IST

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించి సూపర్ హిట్ అయినా సింహాద్రి సినిమా ను భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అప్పట్లోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇతర సినిమాలకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. సింహాద్రి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 20 సంవత్సరాలు కావొస్తుంది.
ఇన్ని సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాబోతున్న సింహాద్రి సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సింహాద్రి సినిమాని ఏకంగా 1000 షోస్ వేసేందుకు ఏర్పాట్లు జరిగాయట. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాను భారీ ఎత్తున రీ రిలీజ్ చేసేందుకు గాను ప్లాన్ చేస్తున్నారు.
సాధారణంగా రీ రిలీజ్ అంటే 200 లేదా 300 వరకు షోష్ చూశాం. కానీ 1000 షోస్ అంటే రీ రిలీజ్ లో ఇది రికార్డు అంటూ నందమూరి అభిమానులతో పాటు ఇతర సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.