NTR : ఎన్టీఆర్ షూ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
NQ Staff - September 21, 2022 / 10:31 AM IST

NTR : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పదుల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఎన్టీఆర్ జీవనశైలి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఖరీదైన కార్లు వినియోగించే సెలబ్రిటీల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు అనడంలో సందేహం లేదు.

NTR Shoe Cost Hot Topic in Social Media
ప్రతి విషయంలో కూడా చాలా రాయల్ గా రిచ్ గా కనిపించే ఉద్దేశం ఎన్టీఆర్ కి ఎప్పుడూ ఉంటుందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి ఎన్టీఆర్ షూస్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటాడని అంటారు. ఆయన కాళ్లకు వేసుకునే షూ కి ఏకంగా 50 వేల నుండి 80 వేల రూపాయలు ఖర్చు చేస్తాడని టాక్ వినిపిస్తుంది. ఆయన ఇంట్లో ఉండే 10 నుండి 15 జతల షూస్ ప్రతిదీ కూడా వేళల్లోనే ఉంటుందంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
తాజాగా ఎయిర్ పోర్టులో అతడు కనిపించిన సందర్భంలో వేసుకున్న షూస్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ షూస్ ఏకంగా 80 వేల రూపాయల షూస్ అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం మొదలుపెట్టారు. ఆన్లైన్లో ఆ షూ యొక్క డిజైన్ ని బట్టి వెతికి రేటు కనిపెట్టారు. మొత్తానికి ఎన్టీఆర్ షూస్ ఖరీదు 80,000 అంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక్కో సినిమాకు దాదాపుగా 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవడంతో పాటు వందల కోట్ల ఆస్తులు ఉన్న ఎన్టీఆర్ ఆ స్థాయి షూస్ వెయ్యడం పెద్ద విషయమేం కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కోసం ఎన్టీఆర్ వెయిట్ చేస్తున్నాడు. అతి త్వరలోనే ఆ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.