NTR: ఆర్ఆర్ఆర్ ఎక్స్‌పీరియెన్స్ షేర్ చేసిన ఎన్టీఆర్.. !

NTR: బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను ఖండాంత‌రాలు దాటించిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఈ సినిమా త‌ర్వాత ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రం చేశాడు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా, ఈ సినిమా కోసం అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

TheNewsQube-
ntr shares his experince
ntr shares his experince

ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ 29వ చిత్రం కాగా, ఇందులో ఎన్టీఆర్ హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీమ్ పాత్రను పోషించాడు మరియు అతని ప్రయాణం వలసరాజ్యాల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామ రాజుతో కలిసి ఉంటుంది.

ntr shares his experince1
ntr shares his experince1

న‌వంబ‌ర్ 2018లో ప్రారంభ‌మైన ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ చాలా అవాంత‌రాల మ‌ధ్య న‌డిచింది. దీనిని క‌ఠినమైన ప్రయాణంగా అభివ‌ర్ణించారు ఎన్టీఆర్. ఉక్రెయిన్‌లోని కీవ్‌లో కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. మహమ్మారి కారణంగా దీనిని భారతదేశంలో చిత్రీకరించడం సాధ్యం కాదు అందుకే అక్క‌డ కొన్ని పాట‌లు చిత్రీక‌రించ‌నట్టు చెప్పుక‌చ్చాడు.

ntr shares his experince2
ntr shares his experince2

సాంగ్ కోసం 15 నుండి 18 టేకులు తీసుకున్నాం. సింక్ కోసం ద‌ర్శ‌కుడు చాలా ఇబ్బంది పెట్టారు. పాట విడుద‌లైన త‌ర్వాత అంత సింక్ ఎలా కుదిరింది అని అడిగారు. అప్పుడు నేను ద‌ర్శ‌కుడి గొప్ప‌త‌నం అని చెప్పాను. ఈ పాట ఇప్ప‌టి వర‌కు 26 మిలియ‌న్స్ వ్యూస్ సాధించింది.

ntr shares his experince3
ntr shares his experince3

రాజ‌మౌళి త‌న సినిమాల‌తో ఎప్పుడు నిరాశ‌ప‌ర‌చ‌డు.స్టూడెంట్ నెంబ‌ర్ 1తో రాజ‌మౌళితో మొద‌లైన ప్ర‌స్థానం ఇంకా సాగుతూనే ఉంది. ఈ సినిమా విజ‌యం సాధిస్తే వీరు ప‌డ్డ క‌ష్టానికి ప్ర‌తి ఫ‌లం ద‌క్కుతుంది.