NTR : ఎన్టీఆర్‌ – ప్రశాంత్ నీల్‌ మూవీ… ఇది కదా కావాల్సింది మాకు

NQ Staff - September 26, 2022 / 02:40 PM IST

NTR : ఎన్టీఆర్‌ – ప్రశాంత్ నీల్‌ మూవీ… ఇది కదా కావాల్సింది మాకు

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా గురించి క్లారిటీ లేదు, కానీ ఆయన తదుపరి సినిమా అంటే 31వ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా కన్ఫర్మ్ అయింది.అందుకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా ను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ అతి త్వరలోనే ఎన్టీఆర్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఎన్టీఆర్ తన 30వ సినిమా త్వర త్వరగా పూర్తి చేస్తే ఆ వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టవచ్చు. ఇక ఎన్టీఆర్ 31వ సినిమా గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.ముఖ్యంగా ఈ సినిమాలో హీరో మరియు విలన్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట. గతంలో జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలో కనిపించాడు.

అందులో ఒకటి విలన్ పాత్ర అనే విషయం తెలిసిందే.ఇప్పుడు కూడా స్వయంగా ఎన్టీఆర్ విలన్ మరియు హీరోగా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆనందంతో ఉన్నారు. కేజిఎఫ్ వంటి అద్భుత సినిమాని ప్రేక్షకులకు అందించి రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తో ఎన్టీఆర్ సినిమా అంటే కచ్చితంగా ఆకాశాన్ని తాకేలా అంచనాలు ఉండడం ఖాయం.

ఆ అంచనాలను అందుకునేలా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తాడని అందరూ నమ్ముతున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నందమూరి అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 2023లో సాధ్యం కాకుంటే 2024 ఆరంభంలో లేదా సమ్మర్ వరకు విడుదలైన ఆశ్చర్యం లేదు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us