NTR: రాజమౌళి టార్చర్ భరించలేకపోయానంటూ ఓపెన్ గా కామెంట్స్ చేసిన ఎన్టీ ఆర్

NTR: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న ఎన్టీఆర్.. దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు చేశాడు. రాజమౌళితో ఎన్టీఆర్ కి చనువు ఎక్కువే. ఇండియన్ సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయాలని చాలా మంది హీరోలు కలలు కంటారు.

NTR Open Comments About Rajamouli
NTR Open Comments About Rajamouli

అయితే రాజమౌళితో సినిమా చేస్తే, కొన్ని సంవత్సరాల పాటు కాల్షీట్స్ కేటాయించాలి. రిస్క్ కూడా ఎక్కువ తీసుకోవాలి. తాజాగా ఎన్టీఆర్.. రాజమౌళి ఎంత కష్ట పెట్టారో చెప్పాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్.. బుల్లితెర ఆడియన్స్ మనసు దోచుకుంటున్నారు. అయితే తాజా ఎపిసోడ్‌లో ఈ షోకి స్పెషల్ గెస్టులుగా వచ్చిన టాప్ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ ఇద్దరూ హాట్ సీట్‌లో కూర్చొని ఎన్టీఆర్‌తో గేమ్ ఆడారు.

సరదాగా సాగుతున్న గేమ్ లో జూనియర్.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చాలా కష్టబెట్టారు అని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ షెడ్యూల్‌లో రాజమౌళి పెట్టిన టార్చర్ మామూలుగా లేదని అన్నారు. అక్కడ మా తాట తీశారంటూ చెప్పిన యంగ్ టైగర్, ఆ టార్చర్ ఎలా ఉందో ఈ సినిమా విడుదలయ్యాక మీరే చూస్తారని అన్నారు.

ఎన్టీఆర్ చెప్పిన మాటలను బట్టి చూస్తే షూటింగ్ లొకేషన్‌లో రాజమౌళి టీం ఎంత కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు. డీవీవీ దానయ్య సమర్పణలో పాన్‌ ఇండియా మూవీగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర రిలీజ్ పై అనుమానాలు నెలకొన్నాయి.