NTR: జూనియర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఎక్క‌డ‌.. వారు నోరు మెద‌ప‌రేం?

NTR: వైసీపీ నేతల తీరుకు అసెంబ్లీలో చంద్ర‌బాబు కన్నీరు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీలో జరిగిన వాదోపవాదనల నడుమ వైసీపీ నేతలు తమ సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడారంటూ చంద్రబాబు బోరున విలపించారు. ఆయన విలపించిన తీరు పైన రాజకీయంగా కలకలం రేగింది. తాము అసలు కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించ లేదని.. ఎవరూ చంద్రబాబు సతీమణి గురించి మాట్లాడలేదని సీఎం జగన్ మొదలు మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు.

TheNewsQube-
jr. ntr not respond
jr. ntr not respond

చంద్రబాబు కన్నీరు పెట్టటంతో… వారి తీరుకు నిరసనగా చంద్రబాబు తాను తిరిగి సీఎం అయ్యే వరకూ సభకు రానని ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. మీడియా సమావేశంలో చంద్రబాబు బోరున విలపించిన తీరు పైన ఇప్పుడు సినీ ప్రముఖులు సైతం స్పందించారు. రాజకీయాలకు దూరంగా ఉండే భువనేశ్వరిని కూడా రాజకీయాల్లోకి లాగి అవమానించారని చంద్రబాబు నాయుడు కన్నీటిపర్యంతమైన నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ నేతలే కాకుండా నందమూరి కుటుంబం కూడా వైసిపి నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యే, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ మా కుటుంబం జోలికి వస్తే సహించేది లేదు ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా నందమూరి చైతన్య కృష్ణ వైసిపి నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడారంటూ ధ్వజమెత్తారు. మీకు అసలు సిగ్గు లజ్జ ఉందా అంటూ నందమూరి చైతన్య కృష్ణ విరుచుకుపడ్డారు.

నందమూరి తారకరామరావు కుమారుడు నందమూరి రామకృష్ణ హెచ్చరించారు. ఆడవాళ్ల మీద ఇలాంటి మాటలు మాట్లాడటం దారుణం అన్నారు. తమ ఆడపడుచుకు జరిగినట్టుగా ఎవరికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొన్ని పేర్లు తీసుకురావాల్సి వస్తుందని.. పరిస్థితులు అలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘ఓరేయ్ నానిగా, వంశీగా, అంబటి రాంబాబు, ద్వారం పూడి చంద్రశేఖర్.. హద్దులు మీరిపోయారు.. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో ఆడవాళ్లు మీ గురించి ఏం అనుకుంటున్నారో చూసుకోండి అన్నారు.

chandra-babu-sensitive-reaction
chandra-babu-sensitive-reaction

నంద‌మూరి కుటుంబం మొత్తం ఈ ఇష్యూపై స్పందించిన ఇంత వ‌ర‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ కాని స్పందించ‌క‌పోవ‌డంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో నంద‌మూరి కుటుంబం మొత్తం ఏకం కావాల‌ని దీనిపై ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ స్పందించాల‌ని వారు కోరుతున్నారు. చూడాలి మ‌రి ఏమైన స్పందిస్తారా లేదా అనేది.