NTR : కొమురం భీమ్ సరికొత్త రికార్డ్..టాలీవుడ్‌లో ఇదే ప్రథమం..!

NTR : కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. భారీ మల్టీస్టారర్‌గా దర్శక ధీరుడి ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్, బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవ్‌గన్, శ్రీయా శరణ్ సహా పలువురు బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు.

ntr-komurambheem-sensational-record
ntr-komurambheem-sensational-record

కాగా విజయదశమి పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అండ్ టీజర్స్ దేశ వ్యాప్తంగా ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ అండ్ ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ చిత్ర బృందం విడుదల చేసిన ఇద్దరు హీరోల ఇంట్రో వీడియోలు మిలియన్ల వ్యూస్ తో ముందెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

NTR : ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన కొమురం భీమ్ టీజర్ సరికొత్త రికార్డ్ ..!

ఇక ఇదే క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన కొమురం భీమ్ టీజర్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆర్.ఆర్.ఆర్ నుంచి 2020 అక్టోబర్ 22న విడుదలయిన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో 50M+ వ్యూస్ మార్క్ అందుకున్న మొట్ట మొదటి టీజర్ గా కొమురం భీమ్ ఇంట్రో వీడియో రికార్డ్ క్రియేట్ చేయడం గొప్ప విశేషం. అంతేకాదు ఈ వీడియోకు 1.30 పైగా లైక్స్ అలాగే 1.40 కామెంట్స్ రావడం విశేషం. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ‘#GonduBebbuliNTRHits50M’ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

Advertisement