NTR: ఆ ఇద్దరు దర్శకులకు హ్యాండ్ ఇచ్చిన యంగ్ టైగ‌ర్..!

NTR: జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఈయన కంటే ఫాస్టుగా సినిమాలు మరెవరూ చేయడం లేదు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు చేస్తున్నారు కానీ యంగ్ టైగర్ అయితే ఏకంగా మరో నాలుగేళ్ల వరకు ఖాళీగా లేడు. ఈయన కోసం దర్శకులు కూడా అంతా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళితో ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా పూర్తైన వెంటనే వరస సినిమాలు పూర్తి చేయనున్నాడు తారక్. ఓ వైపు కొరటాల శివ కథ పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. ఎప్రిల్ 29, 2022 అంటూ డేట్ కూడా ప్రకటించాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా లైన్ లోనే ఉన్నాడు. పరశురామ్, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు కూడా ఎన్టీఆర్ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు.

NTR

అయితే వీళ్లందరి కంటే ముందే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో తారక్ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అది నిజమని దర్శకుడు కూడా చెప్పాడు. అప్పట్లో విజయ్ హీరోగా వచ్చిన విజిల్ ఆడియో వేడుకలో ఎన్టీఆర్ తో తన తెలుగు సినిమా ఉంటుందని చెప్పాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం ఉంటుందని అశ్వినీదత్ సైతం కన్ఫర్మ్ చేసారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం అట్లీ సినిమా ఇప్పట్లో ఉండటం కష్టమే అని తెలుస్తుంది. సినిమా భాషలో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఆ దర్శకుడికి హ్యాండిచ్చినట్లే. దాంతో అట్లీ కుమార్ తన తర్వాతి సినిమాను షారుక్ ఖాన్ తో చేయబోతున్నాడు. మరోవైపు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కూడా తన తర్వాతి సినిమా మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఎన్టీఆర్ తో ఉంటుందని చెప్పుకొచ్చాడు.

NTR

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న సమయంలో నాన్నకు ప్రేమతో సినిమా టైమ్ నుంచి కూడా ఎన్టీఆర్ తో బుచ్చిబాబుకు మంచి స్నేహం ఉంది. దాంతో ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో సినిమాలు ఫిక్స్ అని అధికారిక ప్రకటన వచ్చింది. అవి పూర్తవ్వడానికి 2023 అవుతుంది. అప్పటికి బుచ్చిబాబు సినిమాపై ఆలోచించనున్నాడు జూనియర్. దాంతో అప్పటి వరకు బుచ్చిబాబు అయితే ఖాళీగా ఉండలేడు కదా.. అందుకే మరో హీరో కోసం చూస్తున్నాడు. మొత్తానికి ఈ ఇద్దరు దర్శకులకు ఒకేసారి కంబైండ్ గా హ్యాండిచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.