NTR: రాజ‌కీయాల్లోకి రావాలంటూ చంద్ర‌బాబు ఇలాకాలో ఎగిరిన ఎన్టీఆర్ జెండా

NTR: ఒక‌ప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్న తెలుగు దేశం పార్టీ వెల‌వెల‌పోతుంది. వైసీపీ ధాటికి త‌ట్టుకోలేక చ‌తికిల‌ప‌డిపోయింది. మ‌ళ్లీ ఆ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ పార్టీలో చేరాల్సిందే అంటూ కొన్నాళ్లుగా ప్ర‌చారం న‌డుస్తూ వ‌స్తుంది. టీడీపీలో కొందరు నేత‌లు కూడా ఎన్టీఆర్‌ని ఆహ్వానిస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

NTR Flag Hoisted in CBN Constituency
NTR Flag Hoisted in CBN Constituency

తెలుగు దేశంలో ఉన్న కీల‌క నేత‌లంతా వైసీపీ, బీజేపీలోకి జారుకుంటుండ‌డంతో రానున్న రోజుల‌లో టీడీపీ పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారుతుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవంలోనూ, మహానాడులోనూ నేతల్లో ఎక్కడా జోష్ కనిపించలేదు. దీంతో పార్టీకి మళ్లీ పునర్వైభవం రావాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ ను తెరపైకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

త‌న తాత న‌ట వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగిన జూనియ‌ర్ ఎన్టీఆర్ మంచి మాస్ ఫాలోయింగ్ అందుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో అంచెంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియాగా స్టార్‌గా మార‌బోతున్నాడు. రానున్న రోజుల‌లోను ఎన్టీఆర్ చేసేవ‌న్నీ పాన్ ఇండియా సినిమాలుగానే రూపొందుతాయ‌ని స‌మాచారం.

ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ క్రేజ్ మ‌రింత పెర‌గ‌నుండ‌గా, దీనిని టీడీపీ క్యాష్ చేసుకుంటే బాగుంటుంద‌ని తెలుగు త‌మ్ముళ్లు భావిస్తున్నారు. 2009 ఎన్నికలో టీడీపీ తరఫున ఎన్టీఆర్ జోరుగా ప్రచారం కూడా నిర్వహించారు. ఆ ఎన్నికల్లో తన స్పీచ్‌లతో యువతను ఆకట్టుకున్నాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా చూడాలని అభిమానులు భావిస్తున్నారు.

ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలంటూ ఆయ‌న ఫ్యాన్స్ ఎన్టీఆర్‌తో కూడిన జెండాను రూపొందించి టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో ఎగుర‌వేసారు. ఈ ఏడాది జనవరిలో చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటించినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని కోర‌డం చర్చనీయాంశమైంది. చంద్ర‌బాబు ఎదురుగానే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆయ‌న ఆ స‌మ‌యంలో త‌ల ఊపారు త‌ప్ప ఏమి స్పందించ‌లేదు.

అయితే జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా చూడాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇప్ప‌ట్లో రాజ‌కీయాలు చేసే ఆలోచన లేద‌ని అంటున్నారు. చూడాలి మ‌రి రానున్న రోజ‌లలో ఫ్యాన్స్ డిమాండ్ మేర‌కు ఎన్టీఆర్ రాజ‌కీయాలు చేస్తాడా అన్నది స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది.