NTR: లుక్ మార్చ‌ని ఎన్టీఆర్.. అభిమానుల‌లో అనేక సందేహాలు

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గ‌త కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న‌విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌ల పూర్తి చేయ‌గా, ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంతో బిజీగాఉన్నాడు.అయితే ఎన్టీఆర్ న‌టించిన ఆర్ఆర్ఆర్ కోసం అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు.

NTR

ఎన్టీఆర్ ఇంకా భీమ్ లుక్‌లోనే క‌నిపిస్తున్నాడు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా ‘రాజోలు’ గ్రామానికి చెందిన కొప్పాడి మురళి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదం కారణంగా హాస్పిటల్ పాలయ్యాడు. కొన్ని రోజులుగా ఆయనకి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆయ‌న ఎన్టీఆర్ అభిమానిననీ .. ఆయనతో మాట్లాడాలని ఉందని మురళి చెప్పాడట. వెంటనే వైద్యులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

తన అభిమాని చివరి కోరిక గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే వీడియో కాల్ చేసి అతనితో మాట్లాడాడు. త్వరలోనే కోలుకుంటావంటూ ఆయనకి మనోధైర్యాన్ని చెప్పాడు. అయితే ఎన్టీఆర్ ఆ వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడుతుండగా హాస్పిటల్లో ఎవరో వీడియో తీశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ ఇంకా కొమరం భీమ్ లుక్ తోనే కనిపిస్తుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగు జరుగుతూనే ఉందా? ఇంకా పూర్తికాలేదా? అనే చర్చలు జోరందుకుంటున్నాయి. కథాకథనాలను రెడీ చేసుకోవడానికీ .. గ్రాఫిక్స్ వర్క్ ను దృష్టిలో పెట్టుకుని షాట్స్ రెడీ చేసుకోవడానికి ఆయన చాలా సమయం తీసుకుంటాడు. ఇక ఒక్కోసారి అవసరమైతే రీ షూట్ల కోసం కూడా వెళుతుంటాడు. ఇప్పుడు కూడా అలాంటి వర్క్ ఏదో జరుగుతూ ఉండొచ్చు. ఇక ఈ సినిమా తరువాత కొరటాల ప్రాజెక్టు పైకి ఎన్టీఆర్ వెళ్లనున్న సంగతి తెలిసిందే.

ఇంతకుముందు కొర‌టాల‌- ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత వస్తున్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఉన్నాయి. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక పేరు వినిపిస్తుండటం విశేషం.