NTR: మేన‌ల్లుడిగా ఎన్టీఆర్ ఫెయిల్ అయ్యాడంటూ వ‌ర్ల రామ‌య్య కామెంట్స్

NTR: చంద్ర‌బాబు- జ‌గ‌న్ వివాదం ఎన్టీఆర్‌కి లేనిపోని త‌ల‌నొప్పులు తీసుకొస్తున్నాయి. తాజాగా అసెంబ్లీలో జరిగిన పరిణామాల పైన జూనియర్ స్పందించిన తీరును వ‌ర్ల రామ‌య్య తప్పు బట్టారు. పార్టీ కీలక నేతగా ఉన్న వర్ల రామయ్య చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో దీక్ష ప్రారంభించారు. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

NTR facing problem with cbn issue (1)
NTR facing problem with cbn issue (1)

నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య తెలిపారు.

సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య నిలదీశారు. వల్లభనేని వంశీ ఫొటోలు పెట్టినప్పుడే ఎన్టీయార్ ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదని వర్ల అన్నారు. బూతుల మంత్రి పేర్నినానికి ఎన్టీయార్ అంటే చాలా భయమని, అలాంటి వారిని కంట్రోల్‌ చేసే శక్తి ఆయనకే ఉందని చెప్పారు.

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవాళ్లే టీడీపీ సభ్యులని వర్ల స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీయార్‌పై తాను చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని వర్ల రామయ్య ప్రకటించారు.వ‌ర్ల రామ‌య్య మాట‌ల‌పై కొడాలి నాని స్పందించారు.

జూనియర్ ఎన్టీఆర్ తమను ఎలా కంట్రోల్ చేస్తాడని నాని అన్నారు. ఆయన చెబితే తామెందుకు వింటామన్నారు. నందమూరి కుటుంబమంటే సీఎం జగన్ కూ గౌరవమేనన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు అమాయకులన్నారు. గొర్రె కసాయివాడినే నమ్ముతుందన్నట్టు.. నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబును నమ్ముతున్నారని చెప్పుకొచ్చారు.