NTR: ఫ్యామిలీతో కలిసి టూర్ కి వెళ్ళిన ఎన్టీఆర్.. తనయుడితో సందడి

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం యూరప్ ట్రిప్ లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ కు హాలిడేకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈఫిల్ టవర్ కనిపించేలా.. ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ తో కలిసి దిగిన ఓ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలో ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ ను ముద్దు పెట్టుకుంటుంటే.. అభయ్ మురిసిపోతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ 10 రోజుల పాటు యూరప్ లో ఉంటారట.

TheNewsQube-
NTR spendinf time with family1
NTR spendinf time with family1

గత మూడేళ్ళుగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న క్రమంలో టూర్స్, వెకేషన్లకు వెళ్ళకపోవడంతో ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. మళ్ళీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్ వరుస సినిమాల్లో బిజీగా మారనున్నారు. కనుక ఈ గ్యాప్ లోనే ఫ్యామిలీతో కలిసి టూర్ ని ఎంజాయ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా యాక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ప్రమోషన్ పనుల్లో కూడా ఎన్టీఆర్ బిజీ అవుతారు.

NTR spendinf time with family6
NTR spendinf time with family6

ఈ సినిమాలో కొమురం భీమ్ గా నటిస్తున్నారు. ఇక కొరటాల శివతో సినిమా కూడా భారీ స్థాయిలోనే ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా ఎన్టీఆర్ 30 వ సినిమాగా తెరకెక్కుతుంది.