NTR : ప్రభాస్ చేయాల్సిన సినిమా.. ఎన్టీయార్ చేశాడుగానీ.!
NQ Staff - August 12, 2022 / 08:00 AM IST

NTR : రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా తెరకెక్కిన ‘స్టూడెంట్ నెం.1’ అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకుడు. తొలుత ఈ సినిమా కోసం ఎన్టీయార్ కాకుండా ప్రభాస్‌ని అనుకున్నారట.

NTR doing film Prabhas story
అయితే, హరికృష్ణ అడగడంతో జూనియర్ ఎన్టీయార్ ఆ సినిమా హీరో అయ్యాడని తాజాగా ‘స్టూడెంట్ నెం.1’ నిర్మాత అశ్వనీదత్ చెప్పడం సంచలనంగా మారింది.
ప్రభాస్‌కి ఆ సినిమా నచ్చలేదట..!
‘ఏమీ అనుకోవద్దు.. స్టూడెంట్ నం.1 సినిమా నాకు నచ్చలేదు..’ అంటూ బాహాటంగానే ఓ సందర్భంలో ప్రభాస్ చెప్పాడు. అయితే, ‘సింహాద్రి’ సినిమా చూశాక మైండ్ బ్లాంక్ అయ్యిందనీ, తారక్ తనను ఆ సినిమా చూడమని చెప్పాడనీ ప్రభాస్ చెప్పడం గమనార్హం.
ఇదిలా వుంటే, సినీ పరిశ్రమలో ‘నెపోటిజం’ బాధితుల లిస్టులోకి ప్రభాస్‌ని కూడా చేర్చాల్సి వచ్చిందంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. అలా యంగ్ టైగర్ ఎన్టీయార్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది.
కాదేదీ వివాదానికి అనర్హం అంటే ఇదే మరి. ఇదిలా వుంటే, ‘స్టూడెంట్ నెం.1’ సినిమా ఎన్టీయార్ కోసమే పుట్టిందంటూ పలు సందర్భాల్లో రాజమౌళి చెప్పడం కొసమెరుపు.