NTR : ఇండ‌స్ట్రీలో 21 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్..తొలి రెమ్యున‌రేష‌న్, ఎంత, ఏం చేశాడు?

NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాల న‌టుడిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు. కేవలం 17 ఏళ్ల వయసులోనే హీరో అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. తాత పోలికలున్నాయంటూ ఈయనికి అప్పటికే మంచి గుర్తింపు వచ్చింది. ఓటు హక్కు కూడా రాని వయసులోనే.. మూతిమీద మీసాలు కూడా లేని టైమ్‌లోనే ఇండస్ట్రీ రికార్డులతో ర‌చ్చ చేశాడు. బాల రామాయణం సినిమాతో చెల్డ్‌ ఆర్టిస్టుగా పరిచయం అయ్యి ప్రశంసలు దక్కించుకున్నాడు ఎన్టీఆర్‌.

TheNewsQube-
NTR completed 21 Magical Years in TFI
NTR completed 21 Magical Years in TFI

హీరోగా ఎన్టీఆర్‌ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో 2001 విడుదలైన నిన్ను చూడాల‌ని సినిమా ఇటీవలె 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వైరలవుతుంది. హీరోగా చేసిన తొలి సినిమాకు ఎన్టీఆర్‌ అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా అంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలా హల్‌చల్‌ చేస్తుంది.

NTR completed 21 Magical Years in TFI
NTR completed 21 Magical Years in TFI

నవంబర్ 16తో తారక్ నటుడిగా ఎంట్రీ ఇచ్చి 21 సంత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ క్ర‌మంలో అత‌ని తొలి పారితోషికం ఎంత‌, అత‌ను ఆ మొత్తాన్ని ఏం చేశాడు వంటి వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ‘నిన్ను చూడాలని’ సినిమాకు గాను ఎన్టీఆర్‌ అక్షరాలా 4 లక్షల రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకున్నారట.

NTR completed 21 Magical Years in TFI
NTR completed 21 Magical Years in TFI

తొలి పారితోషికం అందుకున్న వెంటనే ఎన్టీఆర్‌ ఆ డబ్బును తల్లికి ఇచ్చి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక నిన్ను చూడాలని సినిమా అనంతరం రెండేళ్లలోనే స్టూడెంట్ నెం 1, ఆది, సింహాద్రి వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్.

ఇప్పుడు ఒక్కో సినిమాకు 30 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్‌’లో తారక్‌ కొమురం భీమ్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ పూర్తైన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.