Vallabhaneni Vamsi: వ‌ల్ల‌భనేని వంశీ చేతిలో మోస‌పోయిన ఎన్టీఆర్.. టీడీపీ నేత సంచ‌ల‌న కామెంట్స్

Vallabhaneni Vamsi: గ‌త కొద్ది రోజులుగా ఏపీలో రాజ‌కీయం ర‌చ్చ‌గా మారింది. ఒక‌రిపై ఒక‌రు దారుణంగా ఆరోప‌ణలు చేసుకుంటున్నారు.మ‌ధ్య‌లో కొంద‌రిని తీసుకొస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఒక టిడిపి నేత చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలుగులో నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు.

NTR Cheated by Vallabhaneni Vamsi
NTR Cheated by Vallabhaneni Vamsi

2009వ సంవత్సరంలో కోదండరామి రెడ్డి దర్శకుడిగా ముమైత్ ఖాన్ హీరోయిన్ గా రూపొందిన పున్నమినాగు సినిమాతో ఆయన నిర్మాతగా మారారు. ఎన్టీఆర్ న‌టించిన అదుర్స్ సినిమాకు వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నాని ఇద్దరూ కలిసి నిర్మాతలుగా వ్యవహరించారు.

సినిమాల నుంచి చాలా గ్యాప్ తీసుకున్న వల్లభనేని వంశీమోహన్ మళ్లీ 2018వ సంవత్సరంలో రవితేజ హీరోగా వచ్చిన టచ్ చేసి చూడు సినిమా తో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యారు.

రాజకీయ పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీ మోహన్ గురించి ఆయన ఎన్టీఆర్ ను మోసం చేశారని టీడీపీ నేత ఒకరు ఆరోపించారు. వంశీ మోహన్ రాజకీయ నేత, సినీ నిర్మాతగా ఉన్న పరిటాల రవి దగ్గర అనుచరుడిగా ఉండేవారు. అయితే పరిటాల రవి చనిపోయిన సమయంలో ఆయన ఆస్తులు కాజేశారని టిడిపి అధికార ప్రతినిధి సూర్యప్రకాష్ ఆరోపించారు.

అలాగే నమ్మి సినిమా చేసిన ఎన్టీఆర్ ను కూడా ఒక ల్యాండ్ విషయంలో వల్లభనేని వంశీ మోహన్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఇక గతంలో కూడా కొడాలి నాని ఎన్టీఆర్ మధ్య ల్యాండ్ విషయంలో తేడాలు వచ్చాయని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

కొడాలి నాని వైసీపీలో చేరిన సమయంలో ఎన్టీఆర్ మీడియా ముందుకు వచ్చి కొడాలి నాని తనకు స్నేహితుడే కానీ తనకు పార్టీని ముఖ్యమని, తెలుగుదేశం పార్టీ కార్యకర్త గానే ఇప్పటికీ ఉన్నానని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు . ఎన్టీఆర్ సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌లోను స‌త్తా చాటాల‌ని ఆయ‌న అభిమానులు కోరుతున్నారు.