RRR: తెల్లవారితే గురువారం సినిమాకు ఆర్ఆర్ఆర్ టీం స‌పోర్ట్

మణికాంత్ జెల్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన డ్రామా ఎంట‌ర్‌టైన‌ర్ తెల్ల‌వారితే గురువారం. ఇందులో సాయి సింహ కోడూరి, చిత్ర శుక్ల, మిష నారంగ్, సత్య అక్కల, వైవా హర్ష, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని కలిసి నిర్మించగా, కాల భైరవ సంగీతం అందించారు. ఇప్పటివ వ‌ర‌కు చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు మూవీపై భారీ అంచ‌నాలే పెంచాయి.

మార్చి 27న తెల్ల‌వారితే గురువారం చిత్రాన్ని విడుద‌ల చేయ‌నుండ‌గా, ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెంచేందుకు ఆర్ఆర్ఆర్ టీం నుండి రాజ‌మౌళి, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపింది తెల్ల‌వారితే గురువారం టీం. తమ సినిమాను భారీ రేంజ్‌లో ప్రమోట్ చేసుకునేందుకు మార్చి 21న జ‌ర‌గ‌నున్న ప్రీ రిలీజ్ వేడుక‌కు ఇద్ద‌రు దిగ్గ‌జాను చీఫ్ గెస్ట్‌లుగా ఆహ్వానిస్తున్నారు. వారాహి చలన చిత్రం సంస్థకు రాజ‌మౌళికి మ‌ధ్య అనుబంధం ఎప్ప‌టిదో కాగా, వారు పిల‌వ‌గానే లేద‌నుకుండా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతున్నారు.

Advertisement