Prabhas: రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ త‌ర్వాత హాట్ సీట్‌లో ప్ర‌భాస్.. రికార్డులు బ‌ద్ద‌లే..!

Prabhas: ప్ర‌స్తుతం తెలుగులో బుల్లితెర ప్రేక్ష‌కులని అల‌రిస్తున్న షో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు. ఈ కార్య‌క్ర‌మాన్ని జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారు. ఈ షో ద్వారా ప్రేక్ష‌కుల‌కి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు నాలెడ్జ్ కూడా ద‌క్కుతుంది. ఎన్టీఆర్ త‌న‌దైన చలాకీ మాటలు, చలోక్తులతో ఆకట్టుకుంటూ షోకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు.

NTR and Prabhas in Evaru meelo Koteeswarulu Show
NTR and Prabhas in Evaru meelo Koteeswarulu Show

ఇక ఇదిలా ఉంటే రెగ్యులర్‌ కంటెస్టెంట్‌లతో పాటు కొన్ని ఎపిసోడ్స్‌లో సెలబ్రిటీలను కూడా తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ ఇప్పటి వరకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివలతో బుల్లి తెరపై సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎపిసోడ్స్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

ఇక ఈసారి ఎన్టీఆర్‌ టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు తీసుకొస్తున్నాడు. దసరా రోజు ప్రసారమయ్యే ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌లో మహేష్‌ పాల్గొననున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఎన్టీఆర్,మ‌హేష్ క‌లిసి ఉన్న ఫొటో కూడా ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఎపిసోడ్ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతుంద‌ని అంటున్నారు.

NTR and Prabhas in Evaru meelo Koteeswarulu Show
NTR and Prabhas in Evaru meelo Koteeswarulu Show

ఇక ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ కూడా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మానికి గెస్ట్ గా హాజ‌రు కాబోతున్నాడ‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. ఎన్టీఆర్.. ప్ర‌భాస్ ని తీసుకొచ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నాడ‌ట‌. ప్ర‌భాస్ వ‌స్తే రేటింగ్ ద‌ద్ద‌రిల్లి పోవ‌డం ఖాయం అంటున్నారు.

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఆయ‌న కాల్ఫీట్స్ అన్నీ ఫుల్ టైట్‌గా ఉన్నాయి.ఈ స‌మయంలో ప్ర‌భాస్ .. ఎన్టీఆర్ షోకి వ‌స్తాడా అన్న‌ది కొంచెం డౌట్ అంటున్నారు. ఇక ఎన్టీఆర్ త‌న 30వ సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ 30లో కియారా అద్వానీ నటిస్తుందని టాక్ రాగా.. ఆమె స్థానంలో పూజ హేగ్డే వచ్చి చేరింది అని తాజా సమాచారం.