NTR : ఫ్యామిలీతో వెకేష‌న్ ప్లాన్ చేసిన ఎన్టీఆర్.. చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోలు

NTR : గ‌త కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు డిఫ‌రెంట్ లుక్‌లోకి వ‌చ్చాడు. పెరిగిన జుట్టు, మీసం తగ్గించారు. కొమరం భీమ్ రోల్ కోసం రఫ్ లుక్ లోకి మారిన ఎన్టీఆర్, స్లిమ్ గా రెడీ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా… కొంచెం విరామం తీసుకున్నారు.

NTR and his family at airport
NTR and his family at airport

ఆర్ ఆర్ ఆర్ కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టి పనిచేశారు. కఠినమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనడం జరిగింది. షూటింగ్ మొదలైన నెలల వ్యవధిలో ఎన్టీఆర్ చేతికి గాయం కావడం జరిగింది. డూప్ లేకుండా దాదాపు అన్ని సన్నివేశాలలో కష్టపడి నటించారు. మరి మూడేళ్లకు పైగా సాగిన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తో ఎన్టీఆర్ చాలా అలసిపోయారు. దీనితో ఆయన ఫ్యామిలీ తో వెకేషన్ ప్లాన్ చేశారు.

NTR and his family at airport
NTR and his family at airport

భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో పాటు ఆయన విదేశీ విహారానికి వెళుతున్నారు.కుటుంబంతో ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. ఎన్టీఆర్ స్విట్జర్లాండ్ వెళుతున్నట్లు సమాచారం అందుతుంది. దాదాపు వారం రోజులకు పైగా అక్కడే గడపనున్నారట. ఇక ఎన్టీఆర్ చాలా అరుదుగా వెకేషన్స్ కి వెళతారు.

ఆయన ఖాళీ సమయాన్ని ఇంట్లో భార్య పిల్లలతో గడపడానికి ఇష్టపడతారు. కుటుంబాన్ని మీడియాకు, సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఎన్టీఆర్ భార్య సైతం మీడియాలో ఫోకస్ కావాడానికి అసలు ఇష్టపడరు. ఇక వెకేషన్ అనంతరం ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. వచ్చే ఏడాది ఆయన దర్శకుడు కొరటాల శివ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు.

ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీగా తెరకెక్కుతున్నట్లు దర్శకుడు కొరటాల ధృవీకరించారు. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దాదాపు రెండేళ్లు కేటాయించారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కారణంగా 2019,2020,2021 కాలెండర్ ఇయర్‌లో ఎన్టీఆర్ ఏ సినిమా విడుదల కాలేదు.కెరీర్ మొదలుపెట్టి నప్పటి నుంచి వరుసగా మూడు కాలెండర్ ఇయర్స్‌లో ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోవడం ఇదే మొదటిసారి.