Corona: ఈ సారి ఎలుక‌ల నుండి క‌రోనా రానుందా.. శాస్త్ర‌వేత్త‌లు ఏమంటున్నారు..!

Corona: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌ళ‌యం ఎంత భ‌బ‌త్సంగా ఉందో మ‌నంద‌రం చూసాం. ఎంతో మంది ప్ర‌ముఖులు కూడా కరోనా క‌లంలో క‌న్నుమూసారు. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు మాములు స్థితికి వ‌స్తున్నాయి. సార్స్, మెర్స్‌ వంటి వైరస్‌లు గబ్బిలాల నుంచి క‌ర‌నా మనుషులకు వ్యాపించినట్టు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు.ఇక ఎలుక‌ల నుండి క‌రోనా రానుందంటూ హెచ్చ‌రిస్తున్నారు.

now corona attrack from rats1
now corona attrack from rats1

చైనాలో ఉండే హార్స్‌షూ రకం గబ్బిలాల్లో కరోనా వంటి వైరస్‌లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని.. ఆ గబ్బిలాలు వైరస్‌ను తట్టుకుని సహజీవనం చేస్తున్నాయని తేల్చారు. ఈ నేపథ్యంలోనే మనుషులకు దగ్గరగా ఉండే మరేవైనా జంతువులు, పక్షుల్లో ఈ తరహా పరిస్థితులు ఉన్నాయా, వాటి నుంచి మనుషులకు వైరస్‌లు వ్యాపించే ప్రమాదం ఉందా అన్న దానిపై అమెరికాకు చెందిన ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు.

మనుషులకు దగ్గరగా ఉండే కోతులు, చింపాంజీలతోపాటు ఇతర జంతువుల్లో.. కరోనా వంటి వైరస్‌ల ప్రభావానికి లోనయ్యే వాటిని శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకున్నారు. మిగతా అన్ని జంతువుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తూ, ఆ వైరస్‌తో పోరాడుతుంటే.. ఎలుకలు మాత్రం వైరస్‌ను తట్టుకుంటున్నట్టు గుర్తించారు. ఈ ఎలుకలు కరోనా వంటి వైరస్‌ల ప్రభావానికి లోనుకాకుండా వాటిలోని ఏసీఈ–2 రిసెప్టార్లు పరిణామం చెందినట్టు తేల్చారు.

ఈ ఎలుకల ముందు తరాలు తరచూ కరోనా వంటి వైరస్‌ల దాడికి గురవడంతో.. వాటిని తట్టుకునేశక్తిని పెంచుకున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రాఫెసర్లు షీన్‌ కింగ్, మోనా సింగ్‌ వెల్లడించారు. అందువల్లే శరీరంలో వైరస్‌ పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా.. ఆ ఎలుకల్లో ఎటువంటి లక్షణాలు, అనారోగ్యం కనిపించడం లేదని తెలిపారు.

now corona attrack from rats
now corona attrack from rats

ఇలాంటి పరిస్థితుల వల్ల ఎలుకలు సదరు వైరస్‌లకు నిలయం (రిజర్వాయర్లు)గా మారిపోతాయని.. భవిష్యత్తులో ఆ వైరస్‌లు మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. జంతువులు ఎక్కువకాలం ఏదైనా వైరస్‌/ఇతర సూక్ష్మజీవుల దాడికి గురవుతూ ఉంటే.. తమను రక్షించుకునేలా శరీరంలో మార్పులు చేసుకుంటుంటాయి. మనుషుల్లో కూడా ఇదే తరహాలో ఇప్పటికే ఎన్నో రకాల వైరస్‌లు/సూక్ష్మజీవులను తట్టుకునే శక్తి సమకూరింది. కరోనా వైరస్‌ దాడి ఇలాగే సాగితే.. భవిష్యత్తులో అది ఒక సాధారణ జలుబు స్థాయికి మారిపోతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు కూడా.