Biggboss 6 : ఓట్లు పడటం లేదట.! ఎందుకలా జరుగుతోంది బిగ్ బాస్.?

NQ Staff - September 15, 2022 / 08:48 AM IST

158681Biggboss 6 : ఓట్లు పడటం లేదట.! ఎందుకలా జరుగుతోంది బిగ్ బాస్.?

Biggboss 6 : బిగ్ బాస్ రియాల్టీ షో అత్యంత పేలవంగా సాగుతోందని అనుకోవచ్చా.? నిజమే, గతంతో పోల్చితే ఈసారి ఎందుకో బిగ్ బాస్ పట్ల పెద్దగా ఆసక్తి కనిపించడంలేదు. టీవీల్లో ప్రసారమవుతున్న టైమ్ కూడా ఇందుకు ఓ కారణం.

No Voting for Biggboss Season 6

No Voting for Biggboss Season 6

తొలి వీకెండ్‌లో ఓ కంటెస్టెంట్‌ని బయటకు పంపించేయాల్సి వున్నా, ఎందుకో బిగ్ బాస్ టీమ్.. వెళ్ళిపోవాల్సిన కంటెస్టెంట్‌ని క్షమించేసింది. దాంతో, ఎలిమినేషన్ ప్రక్రియ మీద ఓట్లేసే జనాలకి ఇంట్రెస్ట్ పోయింది. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేందుకు లిస్టులో వున్న కంటెస్టెంట్ల తరఫున పీఆర్ టీమ్స్ చాలా హడావిడి చేస్తున్నాయ్.

ఓట్లేసేవారేరీ.?  పీఆర్ టీమ్స్ నానా తంటాలూ పడుతున్నా, కంటెస్టెంట్లకు పెద్దగా ఓట్లు పడటంలేదట. పెయిడ్ బ్యాచ్ ఓట్లు తప్పిస్తే, సామాన్యుల్లో పెద్దగా ఎవరూ ఓటింగ్ చేయడానికి ఇష్టపడటంలేదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ వీక్ ఎవరన్నా ఔట్ అయితే, వచ్చేవారం నామినేషన్ల తర్వాత ఎలిమినేషన్ కోసం ఓటింగ్ కాస్త ఊపందుకునే అవకాశం వుంటుంది. అన్నిటికీ మించి హౌస్ మేట్స్, వీక్షకులకు ఇవ్వాల్సిన రీతిలో స్టఫ్ ఇవ్వడంలేదు. పరమ సోది వ్యవహారంలా తయారైంది.
ఓ కామెడీ లేదు.. ఓ యాక్షన్ లేదు.. ఓ డాన్సూ సరిగ్గా లేదాయె. ఫైమా, ఆర్జే సూర్య, చలాకీ చంటీ.. వీళ్ళెవరూ కామెడీ జనరేట్ చేయకపోవడం పెద్ద మైనస్‌గా కనిపిస్తోంది. మిగతా కంటెస్టెంట్లలోనూ నస బ్యాచ్ ఎక్కువగా వుంది.