Sarkaru vari pata : సర్కారు వారి పాట నుంచి 31న ఏ సర్‌ప్రైజ్ లేదు.

Sarkaru vari pata : సర్కారు వారి పాట..సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే నెల రోజుల దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసింది చిత్ర బృందం. హైదరాబాద్‌లో రెండవ షెడ్యూల్ మొదలు పెట్టిన కరోనా కారణంగా నిలిపివేసింది. అయితే ఈనెల 31న మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట నుంచి మహేష్ ఫస్ట్ లుక్ గానీ, మోషన్ టీజర్ గానీ రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

no surprise from sarkaru-vari-pata on may 31st
no surprise from sarkaru-vari-pata on may 31st

మేకర్స్ కూడా ఇదే ప్లాన్ చేశారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపించింది. అయితే అనూహ్యంగా నిర్మాత, పీఆర్వో బి.ఏ రాజు మరణించడం..కరోనాతో పరిస్థితులన్నీ ఊహించని విధంగా మారిపోయాయి. ఏ ఒక్కరు సంతోషంగా..ధైర్యంగా లేరనే చెప్పాలి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సర్కారు వారి పాట చిత్ర బృందం 31న ఎలాంటి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇవ్వడం లేదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇది మహేష్ ఫ్యాన్స్‌కు ఒక రకంగా పెద్ద డిసప్పాయింట్ అయినా తప్పదు మరి. కరోనా పరిస్థితులు అలా వణికిస్తున్నాయి.

Sarkaru vari pata : సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ కరోనా పరిస్థితులు సద్దుమణిగాక మొదలవనుందట.

ఇక ఈ అప్‌డేట్ ఇచ్చిన మహేష్ టీం అందరూ ఇంట్లోనే ఉండాలని..జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ కరోనా పరిస్థితులు సద్దుమణిగాక మొదలవనుందట. అన్నీ అనుకున్నట్టు పూర్తయితే ఇంతక ముందు మేకర్స్ ప్రకటించిన సమయానికే ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రం శ్రీనివాస్‌తో చేయబోతున్నాడు. త్వరలో ఈ సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.