Krithishetty : కృతిశెట్టి పేరు తప్ప టాలీవుడ్ లో మరో పేరు వినిపించడం లేదు..!

Krithishetty : కృతిశెట్టి పేరు టాలీవుడ్ లో మార్మోగిపోతోంది. ఇలాంటి యంగ్ బ్యూటీని యూత్ ఆడియన్స్ చూసి ఎంతకాలం అయిందో. అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి సినిమాతో శాలినీ పాండే టాలీవుడ్ కి పరిచయం అయింది. అప్పుడు అందరూ ఆ అమ్మాయి గురించే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు అందుకోవడంలో సక్సస్ లు తెచ్చుకోవడం శాలీనీ పాండే సక్సస్ కాలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ కి ఉప్పెన సినిమాతో కన్నడ బ్యూటీ కృతిశెట్టి తెలుగు తెరకి పరిచయం అయింది. ఇలాంటి క్యూట్ హీరోయిన్ ని కుర్రాళ్ళు చూసి ఎన్నేళ్ళు అవుతుందో.

no-one-is-taking-other-name-than-krithishetty-in-tollywood
no-one-is-taking-other-name-than-krithishetty-in-tollywood

అందుకే అందరూ కృతిశెట్టి అంటే పడి చచ్చిపోతున్నారు. కేవలం అభిమానులే కాదు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు కూడా కృతిశెట్టి పేరు జపం చేస్తున్నారు. ఇన్నాళ్ళకి తమకి సరైన జోడీ కృతిశెట్టి రూపంలో దొరికిందని తమ సినిమాలలో నటింపజేయడానికి ఆరాట పడుతున్నారు. ఉప్పెన సినిమా రిలీజ్ కాకముందే కృతిశెట్టి నాని తో శ్యాం సింగ్ రాయ్, సుధీర్ బాబు సినిమాలలో నటించేందుకు సైన్ చేసింది. ఇక ఉప్పెన సినిమా రిలీజయ్యాక ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్, దర్శకుడు సుకుమార్ సహా పలువురు ప్రశంసల జల్లు కురిపించారు.

Krithishetty : కృతిశెట్టి ని మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ కి తీసుకునే ప్రయత్నాలు ..?

దాంతో కృతిశెట్టి కి ఊహించనంతగా క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ మేకర్స్ .. హీరోలు అందరూ కృతిశెట్టి డేట్స్ కోసం క్యూడుతున్నారట. సురేందర్ రెడ్డి – అఖిల్ సినిమా కోసం ఇంతక ముందు సాక్షి వైద్య ని హీరోయిన్ గా అనుకున్నారు. కాని ఇప్పుడు కృతిశెట్టి పేరు పరిశీలిస్తున్నారట. అలాగే రామ్ – లింగుస్వామి కాంబినేషన్ లో రీసెంట్ గా అనౌన్స్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ కి ఈ యంగ్ బ్యూటీనే అనుకుంటున్నారట. అంతేకాదు ఆకాశ్ పూరి నటించబోతున్న ‘చోర్ బజార్’ సినిమాలో కూడా హీరోయిన్ గా కృతిశెట్టి ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇలా దాదాపు మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ కి ఈ యంగ్ బ్యూటీని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

Advertisement