RRR: ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ నెగెటివ్‌గా ఉండ‌దు..!

RRR: న్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.

No negative climax in rrr
No negative climax in rrr

ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రం ఇప్పుడు విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. ప్రస్తుతం ఇటు కరోనా కేసులు తగ్గడంతో పాటు అటు ఏపీలో కూడా టికెట్ రేట్ల విషయంలో త్వరలో క్లారిటీ రానున్న నేపథ్యంలో ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవ్‌గణ్లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌లు నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఉక్రెయిన్ వెళ్లి వచ్చింది ఎన్టీఆర్.. కేవలం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను ఎన్టీఆర్ చెప్పుకోవడం విశేషం.

ఇటు రామ్ చరణ్.. తెలుగు, హిందీ, తమిళంలో మాత్రమే తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం. అటు అజయ్ దేవ్‌గణ్, ఆలియాతో పాటు మిగతా నటీనటులు ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డారట. డబ్బింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా ఫైనల్‌గా కట్ చేసే పనిలో రాజమౌళి పడ్డారట.

పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

No negative climax in rrr
No negative climax in rrr

ఈ సినిమాకి ఎలాంటి నెగెటివ్ క్లైమాక్స్ ఉండ‌ద‌ని అంటున్నారు. అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీంలు చ‌నిపోయేది ఇందులో చూపించ‌మ‌ని అంటున్నారు. ఆ ఇద్ద‌రి మ‌ర‌ణానికి సినిమాకి సంబంధం ఉండ‌దు. ఆందోళ‌న‌ల‌కు సంబంధించి మాత్ర‌మే చిత్రంలో చూపించ‌నున్నార‌ని టాక్.