Olympics: ఒలంపిక్స్‌లో అద‌ర‌గొడుతున్న కూతురు.. టీవీలో కూడా చూడ‌లేని స్థితిలో కుటుంబం

Olympics: ఒక‌ప్పుడు ఒలంపిక్స్‌లో మ‌న హాకీ జ‌ట్టు చ‌రిత్ర‌లు సృష్టించింది. కాని రాను రాను ఆ ప్రాభవం త‌గ్గింది. అయితే ఇప్పుడు ఆట‌గాళ్ల‌ను చూస్తుంటే మ‌ళ్లీ మంచి రోజులు వ‌స్తున్నాయేమో అనిపిస్తుంది. 49 ఏళ్ల తర్వాత పురుషుల జట్టు ఒలింపిక్స్‌ సెమీస్‌లో అడుగుపెట్టగా అమ్మాయిల బృందం చరిత్రలోనే తొలిసారి సెమీస్‌ చేరుకుంది. అంతర్జాతీయ హాకీలో తిరుగులేని జట్టుగా పేరు పొందింది. మూడు సార్లు ఒలింపిక్స్‌ విజేత. ప్రపంచ రెండో ర్యాంకు దాని సొంతం. అలాంటి జట్టును క్వార్టర్‌ ఫైనల్లో రాణి రాంపాల్‌ సేన 1-0 తేడాతో ఓడించింది.

Olympics

లీగ్‌ దశలో వరుసగా మ్యాచులు ఓడిన అమ్మాయిలు ఆపై వరుసగా విజయాల జైత్రయాత్ర కొన‌సాగిస్తున్నారు. అయితే భార‌త మ‌హిళల హాకీ టీం సెమీస్‌లోకి రావ‌డానికి ముఖ్య కార‌ణ‌మైన స‌లీమా టెటె కుటుంబ పరిస్థితి వింటే ఎవ‌రికైన మ‌న‌సు చ‌లించ‌క త‌ప్ప‌దు. ఒక‌వైపు ఒలంపిక్స్‌లో స‌లీమా అద‌ర‌గొడుతుంటే ఆమె కుటుంబ స‌భ్యులు కూతురు ప్ర‌ద‌ర్శ‌న‌ని క‌ళ్లారా చూడ‌లేని దుస్థితి నెల‌కొంది.

టోక్యో ఒలంపిక్స్‌లో పాల్గొన‌డం ద్వారా జార్ఖండ్ గ‌ర్వ‌ప‌డేలా చేసిన భారతీయ మహిళా హాకీ క్రీడాకారిణి సలీమా టేట్. సిమ్‌దేగాలోని బద్కిచాపర్ గ్రామానికి స‌లీమా ఇంట్లో ఒక టీవీ కూడా లేద‌ట‌. మొత్తం ఈ గ్రామంలో 45 ఇళ్లు ఉండ‌గా ఒక్క చోట కూడా టీవీ లేద‌ట‌. ఇంటర్నెట్ క‌నెక్ష‌న్ స‌రిగా లేనందున వారు మొబైల్‌లో మ్యాచ్‌ని చూసే అవ‌కాశం కూడా లేదు. స‌లీమా టేట్ మ్యాచ్ ని చూడ‌లేక‌పోవ‌డం దురుదృష్ట‌కరం అని సలీమా చెల్లెలు చెబుతుంది.

ఇంట‌ర్నెట్ కోసం చాలా ప్ర‌య‌త్నించాం, కాని ఎక్క‌డ‌కు వెళ్లిన కూడా స‌రైన సిగ్న‌ల్స్ రాక‌పోవ‌డంతో చాలా బాధ‌ప‌డ్డాం. ఇప్ప‌టికే మా సోద‌రి ఆడిన మ్యాచ్‌ల‌ను చూడ‌లేక‌పోయాం. బుధ‌వారం జ‌రిగినే సెమీస్‌ని చూసేందుకు జిల్లా యంత్రాంగం ఏదైన ఏర్పాట్లు చేయాల‌ని కోరాం. ఇంట్లో పాత టీవీ ఒక‌టి ఉండ‌గా, ఈ ప్రాంతంలో త‌ర‌చు ఉరుములు, పిడుగులు వ‌స్తున్న నేప‌థ్యంలో అది కూడా ప‌ని చేయ‌డం లేదు.

ఒలింపిక్స్‌లో తన కూతురు దేశం కోసం ఆడుతుంటే ఆ మ్యాచ్ చూడలేకపోతోందని సలీమా తల్లి సోపానీ టేట్ తన బాధను వ్యక్తం చేసింది. అదే గ్రామానికి చెందిన క్రిస్టోఫర్ అనే యువకుడు కూడా ఈ విషయంలో జిల్లా యంత్రాంగం కొన్ని ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. “సలీమా ఈ గ్రామానికి గర్వకారణం కాబట్టి, మ్యాచ్‌ల సమయంలో సలీమాను ఉత్సాహపరిచేందుకు జిల్లా పరిపాలన ద్వారా కొన్ని ఏర్పాట్లు చేయాలి” అని క్రిస్టోఫర్ అన్నారు.

అయితే, డిప్యూటీ కమిషనర్ ఈ విషయంలో అవసరమైన సాయం చేస్తానని చెప్పారు. “సలీమా తన గ్రామానికి మరియు జిల్లాకే గర్వకారణం మరియు అందువల్ల గ్రామానికి అన్ని ప్రాథమిక సౌకర్యాలను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయం మా దృష్టికి వచ్చింది కాబట్టి, మేము వారు కొన్ని ఏర్పాట్లు చేస్తాము అని సుశాంత్ గౌరవ్ అన్నారు. మొబైల్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్య ఉన్న సిమ్‌డెజ్‌లో కొన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయి. అవి క్రమబద్ధీకరించబడుతున్నాయని ఆయన తెలిపారు.