Niharika: సినిమాలో హీరోయిన్‌గా చేయోద్ద‌ని నిహారిక‌కు కండీష‌న్ పెట్టిన ఆమె భ‌ర్త‌

Niharika: నాగబాబు కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక‌ తెలుగులో చేసింది మూడే సినిమాలు, అవి కూడా పెద్దగా సూపర్ హిట్స్ కాకపోయినా నిహారికకు మాత్రం ప్రత్యేక గుర్తింపు వచ్చింది. విజయం, అపజయం ఈ రెండిటినీ సమానంగా భావిస్తూ ముందడుగేస్తున్న ఈ మెగా డాటర్ పెళ్లి తర్వాత కూడా హవా నడిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటూ తన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తోంది.

no heroine chance for niharika2
no heroine chance for niharika2

కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ‘ఆలీతో సరదాగా’ షోలో నిహారిక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తన పెళ్లి, సినిమాల గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

తనది పెద్దలు కుదిర్చిన వివాహం అని, అన్న వరుణ్ తేజ్, తన హస్బెండ్ చైతన్య చిన్నప్పుడు స్కూల్ లో క్లాస్ మేట్స్ అని తెలిపింది. పెళ్ళికి ముందు హీరోయిన్ గా కూడా నటించారు. మరి పెళ్లి అయ్యాక సినిమాలకి దూరంగా ఉన్నారు ఎందుకు అని ఆలీ అడుగగా..మా ఆయనకు నేను సినిమాలు చేయడం ఇష్టం లేదు. అందుకే మానేశాను చెప్పుకొచ్చింది.

ఈ కాలంలో హీరోయిన్‌లకు పెళ్లి అయినా కెరీర్‌ ఏం మారలేదు. సమంతకు పెళ్లికి ముందు ఎంత క్రేజ్‌ ఉండేదో, పెళ్లి అయిన తర్వాత కూడా అంతే ఉంది. మా అయన జస్ట్ సినిమాల్లో హీరోయిన్ గా వద్దన్నారు. కానీ టీవీ, వెబ్ సిరీస్, యూట్యూబ్ వాటికి అడ్డు చెప్పలేదు. అందుకే వాటిల్లో చేస్తున్నాను. బాగా మంచి పాత్ర వస్తే సినిమాల్లో మా ఆయన్ని అడిగి చేస్తాను అని తెలిపింది ఈ కొణిదెల వారమ్మాయి.

చిన్నప్పుడు టీచర్‌ అవ్వాలనుకున్నా. ఏడో తరగతికి వచ్చాక డాక్టర్‌ అవ్వాలని.. చాలా బలంగా అనుకున్నా. కానీ, మా కుటుంబంలో యాక్టర్స్‌తో పాటు కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ల వద్దకు వెళ్లి డాక్టర్‌ అవుతా అంటే.. ‘వద్దమ్మా.. నువ్వు అంత చదవలేవు’ అని నన్ను నిరుత్సాహపర్చారు. డాక్టర్‌ అవ్వాలంటే ఇంటర్‌లో బైపీసీ తీసుకోవాలి. అందులో ఫిజిక్స్‌ ఉండేసరికి నాకొద్దు డాక్టర్‌ అనేశా. నాకు ఫిజిక్స్‌ అస్సలు రాదు. దీంతో మాస్‌ కమ్యూనికేషన్‌, జర్నలిజం చేశా.

no heroine chance for niharika1
no heroine chance for niharika1

ఫిల్మ్‌ కోర్సు కోసం చెన్నై లయోలా కాలేజ్‌కి వెళ్తానంటే.. మా నాన్న యూసుఫ్‌గూడ కాలేజ్‌లో జాయిన్‌ అవ్వు అన్నారు. మా నాన్న నన్ను ఎక్కడికీ పంపేవారు కాదు అని చెప్పుకొచ్చింది నిహారిక‌.