Nivetha thomas : నివేథా థామస్, రెజీనాల సినిమా షూటింగ్ కంప్లీట్..!

Nivetha thomas : నివేదా థామస్ రెజీనా కసాండ్ర కీలక పాత్రల్లో ఒక సినిమా తెరకెక్కించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. ఇద్దరు యంగ్ బ్యూటీస్ నటించిన ఈ సినిమా గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. గత ఏడాది అక్టోబర్ నుంచి మళ్ళీ షూటింగ్స్ మొదలైన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారట. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించారు.

nivetha-thomas-regiena movie shooting complete...!
nivetha-thomas-regiena movie shooting complete…!

యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో మొదలు పెట్టబోతున్నారట. కొరియన్‌ భాషలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ సినిమాను తెలుగులో నివేథా థామస్, రెజీనాలతో రీమేక్‌ చేస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నివేథా, రెజీనా పాత్రలు వైవిధ్యంగా ఉంటాయని సమాచారం. కరోనా మహమ్మారి సాధారణ పరిస్థితికి వచ్చాక ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేస్తారని సమాచారం.

Nivetha thomas : నివేథా థామస్ రీసెంట్‌గా వకీల్ సాబ్ లో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది.

ఇక ఈ సినిమాకి ప్రస్తుతం శాకినీ-ఢాకినీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా అధికారకంగా ఈ టైటిల్ కన్‌ఫర్మ్ కాలేదు. నివేథా థామస్ రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ లో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక రెజీనా ఎవరు సినిమా తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది.

Advertisement