ఇక ఎదురుచూడడం అనవసరం ..

Advertisement

ఇక ఎదురు చూడడం అనవసరం …కరోనా వలన ఇప్పటి వరకు వాయిదా వేసింది చాలు … నేను ఈనెలాఖరు లోపు కల్లా పెళ్లి చేసుకుంటా …. ఇవి లవర్ బాయ్ హీరో నితిన్ తెలుపుతున్న మాటలు… వివరాల్లోకి వెళితే గత కొన్ని నెలలే క్రితమే నితిన్ కి ఎంగేజ్ మెంట్ అయ్యిన విషయం అందరికి తెలిసిందే. ఏప్రిల్ లో నితిన్ పెళ్లి దుబాయ్ లో జరగనుంధీ అని ప్రేక్షకులతో మరియు తన సన్నిహితులందరితో ను పంచుకున్నాడు నితిన్ అయితే తన ఈ మ్యారేజ్ వెడ్డింగ్ ని ఘనంగా దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ లా ప్లాన్ కూడా చేసుకోవడం జరిగింది.

అదే సమయం లో ఒక్క సారిగా ప్రపంచమంతా కరోనా విజృంభించడం, లాక్ డౌన్ అమలు చేయడం తో కరోనా ఉధృతి పూర్తిగా తగ్గిన తరువాతే పెళ్లి తంతు తాను అనుకున్నట్టుగా జరుపుకోవాలని నితిన్ పెళ్లి కాస్త వాయిదా వేసుకున్నాడు.. ఆ సమయం లోనే నిఖిల్ నిచ్చితార్ధం జరగడం కరోనా ఇప్పట్లో తగ్గదని గ్రహించిన నిఖిల్ పెళ్లి చేసేసుకోవడం ఆ తరువాత్త రానా తన పెళ్లి గురించి అనౌన్స్ చేయడం అది కూడా త్వరలోనే జరగబోతుండడం తో. ఇంకా ఈ కరోనా ఎలాగూ ఇప్పట్లో తగ్గదు అన్న నిర్ణయానికి వచ్చిన నితిన్ కనీసం రానా కంటే ముందు అయినా తన పెళ్లి ని జరుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు అంట.

నితిన్ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు కూడా రోజులు గడిచే కొద్ది కరోనా ప్రభావం పెరుగుతుందే కానీ తగ్గదు అని చెప్పడం తో ఇక ఎదురు చూడడం అనవసరం అని తన పెళ్లి డేట్ ని మరల ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. అయితే నితిన్ ఈ నెలాఖరులోపు తాను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నప్పటికీ… దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది . మొత్తానికి ఈ సారి స్టార్ పెళ్లిళ్ల కు కరోనా పెద్ద అడ్డుకట్ట వేసి ఆటంకం కలిగిస్తుందనే చెప్పుకోవచ్చు.

ఆలా మొత్తానికి ఈ నెల చివరి లోపు తన బ్యాచిలర్ లైఫ్ కి బాయ్ చెప్పేసి ఫామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టనున్నాడు . ఇక ప్రస్తుతం నితిన్ , వెంకీ అట్లూరి దర్శకత్వం లో రంగ్ దే సినిమా చేస్తుండగా ఈ సినిమాలో నితిన్ కి జంటగా కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ సినిమా 50 కి శాతం పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది అని తెలుస్తుంది. కరోనా లాక్ డౌన్ వలన నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందు కు ఎప్పుడు వస్తుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here