Nithiin: ఆద్యంతం అల‌రించేలా ఉన్న మాస్ట్రో ట్రైల‌ర్.. థ్రిల్లింగ్ సీన్స్‌తో పెరిగిన ఆస‌క్తి

Nithiin: ల‌వ‌ర్ బోయ్ నితిన్ మంచి స్పీడు మీదున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాల‌తో ప‌ల‌క‌రించిన నితిన్ ఇప్పుడు మ‌రో సినిమాతో అలరించేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఏడాది మొద‌ట్లో రంగ్ దే చిత్రంతో ప‌ల‌క‌రించిన నితిన్ ఆ త‌ర్వాత చెక్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన మాస్ట్రో సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు.

హిందీలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘అందాధూన్’ సినిమాని నితిన్ తెలుగులో ‘మాస్ట్రో’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నాడు నితిన్.నభా నటేష్‌ కథానాయికగా తమన్నా కీలక పాత్రగా రాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ‘కళ్ళు కనపడకపోతే ఇబ్బందులు అందరికి తెలుసు, కానీ అందులో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి’ అంటూ సాగిన ఈ ట్రైలర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. ‘సినిమాల్లోనే మర్డర్ చూసి భయపడే నేను.. ఇప్పుడు నిజంగా మర్డర్ చేయాల్సి వచ్చింది’ అంటూ తమన్నా చెప్పిన డైలాగ్ వీక్షకులను ఆకట్టుకుంది.

అంధుడిగా నితిన్‌ నటన మెప్పిస్తోంది. నాయికల అందం కనువిందు చేస్తోంది. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.
ముఖ్యంగా నితిన్ – తమన్నా పాత్రలకు సంబంధించిన ట్రాక్ తో పాటు.. సినిమాలో మెయిన్ ఎమోషన్స్ ను ట్రైలర్ లో బాగా ఎలివేట్ చేశారు. గ్రిప్పింగ్ గా ఉన్న ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. కాగా మేర్లపాక గాంధీ ఈ సినిమాని తెరకెక్కించారు. ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.

ఈ సినిమా త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌ స్టార్‌లో విడుదల కానుంది. ‘బ్లాక్‌ కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది.సెప్టెంబర్ 10న ఈ మూవీని హాట్ స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదల చేయబోతున్నారని సమాచారం. హిందీలో హిట్ అయిన అందాదున్ తెలుగులో మాస్ట్రోగా ఎంత‌గా అల‌రిస్తుందో చూడాలి.