NITHIN : ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో రంగ్ దే చిత్రం ఒకటి. నితిన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరీ తెరకెక్కించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నారు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి రంగ్ దే చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చేలా చిత్రీకరించినట్టు తెలుస్తుంది. చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చగా, మూవీ నుండి విడుదలైన పాటలు శ్రోతలను ఎంతగానో రంజింపజేశాయి.
నితిన్ నటించిన చెక్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించకపోవడంతో రంగ్ దే సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సెట్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్‌ని వీడియోలుగా రూపొందిస్తూ ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్న మేకర్స్ సినీ లవర్స్‌ను బాగానే అట్రాక్ట్ చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్, నితిన్ మధ్య జరిగిన ఓ క్రేజీ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఇది ఆకట్టుకుంటుంది.
ఒకప్పుడు బొద్దుగా ఉన్న కీర్తి సురేష్ ఈ మధ్య కొంత సన్నబడింది. మళ్లీ లావెక్కుండా డైట్ మెయింటైన్ చేస్తుంది. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ ఫ్రూట్స్ వంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటుంది. అయితే రంగ్ దే సెట్లో కీర్తి సురేష్ ఫుడ్ తింటుండగా, నితిన్ చక్కగా పిజ్జా తెప్పించుకొని తింటున్నాడు. కీర్తిని తినమని ఆఫర్ చేసిన మొదట్లో నేను తినను అంటూ మొండికేసి కూర్చుంది. కాని కొద్ది సేపటికి నోట్లో ఊరుతున్న నీళ్లని కంట్రోల్ చేసుకోలేక హ్యాపీగా తినేసింది. మొత్తానికి కీర్తి సురేష్ పెట్టుకున్న రూల్స్ ని నితిన్ ఇలా బ్రేక్ చేయించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.నమని ఆఫర్ చేసిన మొదట్లో నేను తినను అంటూ మొండికేసి కూర్చుంది. కాని కొద్ది సేపటికి నోట్లో ఊరుతున్న నీళ్లని కంట్రోల్ చేసుకోలేక హ్యాపీగా తినేసింది. మొత్తానికి కీర్తి సురేష్ పెట్టుకున్న రూల్స్ ని నితిన్ ఇలా బ్రేక్ చేయించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
View this post on Instagram