గత నెలలో హీరో నితిన్, నటి ప్రగతి కలిసి కొన్ని వీడియోలు షేర్ చేశారు. షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అప్పట్లో అవి బాగానే వైరల్ అయ్యాయి. ఆ సంగతి అందరికీ తెలిసిందే. నితిన్ పక్కన హీరోయిన్లా ఉన్నావ్ అని ప్రగతికి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. అయితే నితిన్ పక్కన ప్రగతి అమ్మగా నటించింది. అది కూడా ఓ యాడ్ కోసం. తాజాగా ఆ యాడ్ బయటకు వచ్చేసింది. దానికి సంబంధించిన వీడియో బాగానే క్లిక్ అవుతోంది.

అమ్మ కిచెన్‌లో స్నేహా చికెన్ అంటూ రూపొందించిన యాడ్‌లో నితిన్‌కు అమ్మలా ప్రగతి నటించింది. అయితే ఇందులో ప్రగతి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది. మొత్తం నితినే ఉన్నాడు. కానీ మేకింగ్ ఫోటోలు, వీడియోల్లో మాత్రం ప్రగతి రచ్చ చేసింది. మొత్తానికి తిన్నావారా అనే డైలాగ్‌ను ఈ యాడ్‌లో వాడేశారు. ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే అమ్మ అడిగే ఒకే ఒక్క ప్రశ్న.. తిన్నావా. అదే లైన్‌ను బేస్ చేసుకుని రూపొందించిన ఈ యాడ్‌లో నితిన్, ప్రగతి బాగానే చేశారు.
మొత్తానికి ప్రగతి లాక్డౌన్లో పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతి ఫలం దక్కుతోంది. ప్రగతి డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. జిమ్‌లొ భారీ భారీ కసరత్తులు చేస్తూ అందరిలోనూ స్ఫూర్తినింపింది. అలాంటి ప్రగతికి ఇప్పుడు వరుసగా ఆఫర్లు వచ్చేస్తున్నాయి. సినిమాలతో బిజి బిజీగా గడిపేస్తున్న ప్రగతికి.. ఇలా యాడ్స్ రూపంలోనూ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ప్రగతి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.