Nithiin: పదే పదే అదే మాట.. చెక్ సినిమాపై నితిన్ తీర్పు!

Nithiin మామూలుగా హీరోలెవ్వరూ కూడా తమ సినిమాలు ఫ్లాప్ అయితే నోరు మెదపరు. అయితే ఈ మధ్యే కాస్త మారుతున్నారు. జనాల ముందు నిజాలను ఒప్పుకుంటున్నారు. బహిరంగంగా చెప్పేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయింది.. మిమ్మల్ని అలరించలేకపోయామని చెప్పేసుకుంటున్నారు. కానీ నితిన్ మాత్రం మరో కొత్త స్టైల్లో‌ తన సినిమా ఫలితం గురించి చెప్పుకొచ్చాడు. గత సినిమా గురించి చెబుతూ.. ప్రస్తుత చిత్రాన్ని ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నాడేమో అని అనిపించింది.

పదే పదే అదే మాట.. చెక్ సినిమా పై నితిన్ తీర్పు!

నితిన్ చెక్ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వలేదన్న విషయం అందరికీ తెలిసిందే. చెక్ సినిమాకు దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. అయితే ఈ మూవీ గురించి నితిన్ తన రంగ్ దే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాడు. వెన్నెల కిషోర్ గురించి చెబుతూ.. భీష్మ కంటే ముందు నాకు ఒక ఫ్లాప్ ఉంది..వెన్నెల కిషోర్ వచ్చి భీష్మతో హిట్ ఇచ్చాడు. మళ్లీ ఇప్పుడు చెక్ సినిమా అస్సాం పోయింది.. కానీ దాన్ని మళ్లీ వెనక్కి తెచ్చేందుకు వెన్నెల కిషోర్ రంగ్ దేలో ఉన్నాడని నితిన్ అన్నాడు.

Nithiin About Check movie Result
Nithiin About Check movie Result

ఇక హారిక హాసిని, సితార బ్యానర్స్ గురించి చెబుతూ.. ఇందులో నాది మూడో సినిమా అని అన్నాడు నితిన్. అఆ కంటే ముందు ఫ్లాప్ ఉంది.. కానీ అఆతో హిట్ ఇచ్చారు. భీష్మ కంటే ముందు ఫ్లాప్ ఉంది.. మళ్లీ భీష్మతో హిట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు కూడా చెక్ ఫ్లాప్ అయింది.. మళ్లీ రంగ్ దే సినిమాతో హిట్ ఇవ్వబోతోన్నారు అని నితిన్ తన చెక్ సినిమా గురించి తానే తక్కువ చేసి మాట్లాడుకున్నాడు. మొత్తానికి ఇలా పబ్లిక్‌గా పదే పదే అదే మాట చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Advertisement