Nischay Wedding Video: నిహారిక‌- చైత‌న్య వెడ్డింగ్ వీడియో.. ఓ రేంజ్‌లో సాగిన సంద‌డి..!

Nischay Wedding Video: మెగా వారసురాలు నిహారిక .. గుంటూరు మాజీ ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డను వివాహ‌మాడిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి తంతు జ‌రిగింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్‌ శుభకార్యానికి వేదిక అయింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆగస్టులో నిహారిక-చైతన్యల నిశ్చితార్థం జరిగింది.

Nischay Wedding Video Looks Beautiful
Nischay Wedding Video Looks Beautiful

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి వేడుక ఎంత ఘ‌నంగా జ‌రిగిందో మ‌నం చూశాం. ఇంటిని రంగురంగుల పువ్వులు, తోరణాలతో అలంకరించారు. నిహారికకు పసుపు రాసి, మంగళ స్నానం చేయించారు. నిహారిక చిలకపచ్చ రంగు పట్టు చీరలో కళకళలాడారు. సంగీత్ ,పెళ్లి వేడుక ఎంతో ఘ‌నంగా జ‌రిగాయి. వీటికి సంబంధించి తాజాగా వీడియో విడుద‌ల కాగా, ఇందులో హంగామా ఎంతో ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ వీడియో చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు.

చైతన్య హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బిట్స్‌ పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మ్యాథమెటిక్స్‌ చేశారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ చదివారు. హైదరాబాద్‌లోని ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

నిహారిక పెళ్లిలో అంద‌రు డాన్సులు చేసారు . పవన్ నుంచి పంజా వైష్ణవ్ తేజ్ వరకు అంతా అక్కడే ఉన్నారు. దానికితోడు దేవతల పెళ్లి అన్నంత గ్రాండ్‌గా ఈ వేడుక జరిగింది. రెండు రోజులు ఉదయపూర్ కోటలో పెళ్లి అంటే చిన్న విషయం కాదు. దానికి చాలా కోట్లు ఖర్చు అవుతాయి. అక్కడ ప్రాంగణం కోసమే 70 లక్షలు అవుతుందని ఓ అంచనా. ఇక ప్యాలెస్.. అందులో ఏర్పాట్లు.. ఆ తర్వాత సంగీత్ అవన్నీ కలిసి కోట్లలోనే లెక్కలుంటాయి.

నిహారిక పెళ్లి కోసం కూడా అంతే ఖర్చు అయిందని తెలుస్తుంది. పెళ్లి జరిగి ఐదు రోజులు కావొస్తుండటంతో నిహారిక పెళ్లి కోసం దాదాపు 30 కోట్లకు పైగానే ఖర్చు చేసారని ప్రచారం జరుగుతుంది. మరో 10 కోట్లు అదనంగా అయ్యుండొచ్చనే వాదన కూడా వినిపిస్తుంది.