CHECK: వీడియోలో అందాల‌కు చెక్ పెట్టిన ప్రియా ప్ర‌కాశ్

CHECK ఒరు అదార్ లవ్ సినిమాలోని ఓ వీడియో సాంగ్‌లో క‌న్నుగీటి దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ సినిమా తరవాత ఆమెకు వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. ‘చెక్’ సినిమాతో ప్రియా ప్రకాశ్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. యూత్ స్టార్ నితిన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా ‘చెక్’ సినిమా ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల కానుంది.

రిలీజ్‌కు మ‌రో రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉన్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. తాజాగా మూవీ నుండి నిన్ను చూడ‌కుండా అనే సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో ప్రియా ప్ర‌కాశ్ రెచ్చిపోయి న‌టించింది. నితిన్‌తో రొమాన్స్, అందాల ఆర‌బోత‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కంటి నుండా కునుకు లేకుండా చేసేలా క‌నిపిస్తుంది. ఈ చిత్రంలో యాత్ర అనే పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నుంది ప్రియా ప్ర‌కాశ్.

 

 

Advertisement