నేను పవర్ స్టార్ భక్తున్ని… దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరో నిఖిల్..

Advertisement

ట్విట్టర్ లో తాను పెట్టిన ఒక పోస్టుకు సెటైర్ వేసిన ఓ యువకునికి గట్టి కౌంటర్ వేసాడు హీరో నిఖిల్… అసలేం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్తే తను చేసిన సినిమాలు హాపీడేస్, స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికిపోతావ్ చిన్నవాడా, అర్జున్ సురవరం ఇంకా తన ఇతర అన్ని సినిమా ఆడియో లాంచ్ లలో డాన్స్ స్టెప్పులేస్తుంటాడు ఈ యువ హీరో. ఇదంతా ఒకెత్తు అయితే తను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని అని చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది …

అందుకే పవన్ కళ్యాణ్ సినిమా పాటలకు స్టెప్పులేయడం వంటివి చేస్తూ అతని పైన ఉన్న అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు .. అంతే కాకుండా తను ఓ ఆడియో లాంచ్ లో చెప్పిన ఖుషీ సినిమాలోని డైలాగ్స్ గుర్తుచేసుకుంటు, పవర్ స్టార్ ఒక గొప్ప వ్యక్తి అని తను అంటే నాకు ఎంతో ఇష్టమని నేను పవన్ కళ్యాణ్ భక్తున్ని అని ట్విట్టర్ లో తన పాత జ్ఞాపకాల సంబంధించిన ఒక వీడియో ని పెట్టాడు ఈ యువ హీరో… ఈ పోస్టుకు ఓ యువకుడు స్పందించి ” భజన స్టార్ట్ చేసావా ” అని ఎగతాళిగా కామెంట్ పెట్టగా .ఇది చుసిన నిఖిల్ అతగాడికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.

మూసుకో బ్రో.. ఒకరిని ప్రేమించే స్వేచ్ఛ నాకుంది ఎవ్వరు ఏం అనుకున్నా నేను నిజమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానినని గర్వంగా అతనికి రిప్లై ఇచ్చాడు హీరో నిఖిల్. ఆ యువకుని రిప్లై కు నిఖిల్ ఒక్కడే కాకుండా పవర్ స్టార్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతూ… నిజంగా అభిమానిస్తున్నాడు కాబట్టే తన పాత వీడియో ను షేర్ చేసుకున్నాడు అని… ఇంకొందరు తెలిసి తెలియక మాట్లాడడం పద్దతి కాదని… మరికొందరైతే ఆ కామెంట్ చేసిన వ్యక్తిని బండ బూతులు తిడ్తున్నారు. మొత్తానికి ఈ పోస్టు ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here