Nikhil: సామాన్య ప్రజలపై హాస్పిటల్ బిల్లుల భారం..మండి పడ్డ హీరో నిఖిల్

Nikhil: కరోనా.. ఈ మూడక్షరాల పదం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. అయితే ఈ మహమ్మారి ఎంతోమంది సామాన్యుల్ని నడిరోడ్డున పడేసింది. కరోనా వచ్చి దాని వల్ల మరణిస్తామనే భయం కంటే, హాస్పిటల్ ఖర్చులు, బిల్లులు ఎంతవుతాయోననే భయం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది అభాగ్యులు కరోనా వచ్చినా.. గవర్నమెంట్ హాస్పిటల్ లో బెడ్స్ లేక, ఇటు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళలేక సతమతమవుతున్నారు. అందుకే కరోనా వచ్చినా రోజులు తరబడి ఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

NIkhil Fire on Hospitals for Excess Bills
NIkhil Fire on Hospitals for Excess Bills

మరికొంతమందైతే ప్రాణాల్ని వదిలేస్తున్నారు. ఈ విషయంపై ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ సెలెబ్రిటీలు స్పందించినా ప్రయోజనం లేకపోయింది. మాదిరి మధ్యతరగతి వర్గం ఆస్తులు అమ్ముకున్నా పర్లేదు ప్రాణాలు ఉంటే చాలని అనుకుంటున్నారు. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ? కూలీనాలీ చేసుకుంటున్న వారంతా తమ భాదను ఎవరికి చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హాస్పిటల్ బిల్స్ పై ఆవేదన వ్యక్తం చేశారు. సర్జరీ ఏదైనా సరే బిల్లులు మాత్రం లక్షల్లో ఉండేలా హాస్పిటల్ యాజమాన్యం చూస్తుందని అన్నారు. ఈ మేరకు సామాన్యులపై పడుతున్న ఆర్థిక భారం పై లేటెస్ట్ గా తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ పోస్ట్ చేశారు.

‘నేను ఎంతోమంది ఆస్పత్రి బిల్లుల్ని చూశానని.. అందులో చాలావరకు 10 లక్షలకు పైగానే ఉన్నాయని, హాస్పిటల్ బిల్స్ కట్టలేక సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారి బాధను మేము కూడా పంచుకున్నామని తెలిపారు. అయితే బిల్లులు వేయడంలో ఆస్పత్రుల వ్యవహారం బాధాకరంగా ఉందని, సాధారణ సర్జరీకి కూడా మన స్థానిక ఆస్పత్రులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయని.. వీటిని కంట్రోల్ చేసేవారెవరని’ నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడటంతో నిఖిల్ సైతం తన టీమ్ తో కలిసి ఎంతోమంది బాధుతులకు హెల్ప్ చేశారు. సోషల్ మీడియా వేదికగా హాస్పిటల్ బెడ్స్, మెడిసన్, ఇలా వారికి కావాల్సినవన్నీ అందించారు.