Nikesha Patel : నిషా కళ్లతో నికీషా పటేల్ గ్లామర్ సెగల్.!
NQ Staff - October 25, 2022 / 09:13 AM IST

Nikesha Patel : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘కొమరం పులి’ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ నికీషా పటేల్ గుర్తుందా.? ఒకే ఒక్క సినిమాతో చెక్కేసిందీ అందాల భామ. ఆ తర్వాత పూరీ జగన్నాద్ తమ్ముడు పూరీ శంకర్‌తో ఓ సినిమా చేసింది కానీ, ఆ సినిమా ఎప్పుడు రిలీజైందో ఏమో, అసలు రిలీజైందో లేదో కూడా తెలీదు.
కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాలో గ్లామర్ హల్‌చల్ చేసిన నికీషా పటేల్, ఈ మధ్య చాలా కాలం నుంచి పెద్దగా పత్తా లేకుండా పోయింది. బికినీ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్‌గా నెటిజనాన్ని తన అందాలతో తెగ హీటెక్కించేసిందీ హాట్ భామ.
ఏమైందో ఏమో తెలీదు కానీ, లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడే నెట్టింట ప్రత్యక్షమైంది. ఆల్రెడీ అమ్మడి అందాల విందు బాగా అలవాటైన నెటిజనం, నికీషా రాకతో పండగ చేసుకుంటున్నారు. దీపావళికి సరికొత్త గ్లామర్ లుక్స్‌తో కేక పుట్టించిన నికీషా పటేల్, ఈ మధ్య పవన్ కళ్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసి సెన్సేషనల్ అయిన సంగతి తెలిసిందే.
ఎలాగూ తనను మర్చిపోయారు కాబట్టి, గుర్తు చేసుకోవాలనుకుందో ఏమో, వైజాగ్ నోవాటెల్ హోటల్ నిర్భంధం నేపథ్యంలో వైజాగ్ బీచ్‌లో ఈవెనింగ్ వాక్‌కి వెళ్లాలని వుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు ఈ అమ్మడు తనదైన శైలిలో స్పందించింది.
పవన్ వాక్ చేస్తే, ఆయన వెంట తానూ వస్తా.! అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించి అటు పవన్ ఫ్యాన్స్‌తో పాటూ, ఇటు తన పాత ఫ్యాన్స్‌నీ విశేషంగా ఎట్రాక్ట్ చేసింది నికీషా పటేల్.

Nikesha Patel new cute photos