Niharika: మా నలుగురికి మెంట‌ల్ ఉంది, ఆయ‌న మాత్రమే పంది అని పిలుస్తారు: నిహారిక‌

Niharika: మెగా ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలున్నారు. చిరంజీవి స్పూర్తితో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన స్టార్స్ త‌మ‌దైన టాలెంట్‌తో ముందుకు సాగుతున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్. అన్నయ్య చిరంజీవి బాటలోనే నడుస్తూ ఈ ఇద్దరూ అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో తమ మార్క్ చూపెడుతున్నారు. ముగ్గురు మొనగాళ్లుగా మెగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్.

TheNewsQube-
niharika stunning comments viral1
niharika stunning comments viral1

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురిగా ప‌రిచ‌యం అయిన నిహారిక టీవీ రంగంలో హోస్ట్ గానూ అలరించింది. పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తూ.. పలు వెబ్ సిరీసుల్లోనూ మెరిసింది. ఈ క్రమంలో నిర్మాతగా మారి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ ని నిర్మించింది. జీ5 ఓటీటీలో నవంబర్ 19 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ కార్యక్రమానికి హాజరైన నిహారిక.. పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది.

తాజాగా ప్రోమో విడుద‌ల చేయ‌గా, ఇందులో నిహా ప‌లు విష‌యాలు షేర్ చేసుకుంది. చిన్నప్పుడు తన తండ్రి ఒకసారి కొట్టారని.. వరుణ్ తేజ్ తో విపరీతంగా పొట్లాడానని నిహారిక తెలిపింది. తనది పెద్దలు కుదిర్చిన వివాహమని.. అంతకుముందెప్పుడూ చైతన్యను చూడలేదని.. తనని చైతన్య టీవీలో చూసి ఉండొచ్చని నిహారిక సరదాగా నవ్వేసింది.

niharika stunning comments viral2
niharika stunning comments viral2

చిరంజీవి – పవన్ కల్యాణ్ – నాగబాబుల్లో ఎవరంటే బాగా ఇష్టమని అడగ్గా.. తన తండ్రి అంటే ఎక్కువ ఇష్టమని.. ఆయన లేకపోతే చచ్చిపోతానని అని మెగా డాటర్ చెప్పుకొచ్చింది. తనతో పాటుగా తన తండ్రి – చిన్న మేనత్త – సాయి ధరమ్ తేజ్ లకు కాస్త మెంటల్ ఉందని చెప్పి నవ్వులు పూయించింది.

తన తండ్రి నాగబాబు తనని ‘మమ్మీ’ అని పిలుస్తారని.. సోదరుడు వరుణ్ తేజ్ పరిస్థితులను బట్టి నిహా అని.. బాగా ముద్దొస్తే బంగారం.. ఇంకా బాగా ముద్దొస్తే పంది అని పిలుస్తారని నవ్వుతూ చెప్పింది.