Niharika: ఆ విషయం బయటపెట్టి నాగబాబు పరువు తీసిన నిహారిక..!

Niharika: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులున్నారు. వారిలో బెస్ట్ తండ్రీకూతుళ్ళు కూడా ఉన్నారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మెగా బ్రదర్ నాగబాబు, ఆయన కూతురు నిహారికలు మాత్రం కాస్త స్పెషల్. వీరిద్దరి బంధం, ప్రేమ, ఆప్యాయతలు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమకు సంబంధించిన ఎన్నో గుర్తులను అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటారు. లేటెస్ట్ గా వీరిద్దరూ కలిసి ఓ కమర్షియల్ యాడ్ లో నటించారు.

Niharika Reveals Secret About Nagababu
Niharika Reveals Secret About Nagababu

ఆన్ లైన్ బ్యాంకింగ్ పై అవగాహన కల్పిస్తూ ప్రమోట్ చేసిన ఓ ప్రకటన వీడియోని రీసెంట్ గా నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో తండ్రీకూతుళ్ళకు సంబంధించి పర్సనల్ విషయాలను చెబుతూ క్రియేట్ చేసిన ఈ ప్రకటన ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో నిహారిక తన తండ్రి నాగబాబుతో ఉన్న చిన్ననాటి ఫోటోలతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నిహారిక తండ్రి నాగబాబు గురించి చెబుతుంది.

ఆమె నవ్వుతూ.. చిన్నప్పటి నుండి నాన్న తనకు ఎంతో రక్షణగా ఉన్నారని.. ఒక నటుడిగా, రైటర్ గా, ప్రొడ్యూసర్ గా తనను ఎప్పుడూ గైడ్ చేస్తూనే ఉన్నారు. లైఫ్ లో అన్ని రకాల పాత్రలను ఆయన విజయవంతంగా పోషించారు. ఒక్క ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ తప్ప అంటూ యాడ్‌లో చెప్పుకొచ్చింది నిహారిక‌. ఈ యాడ్ చూసిన నెటిజ‌న్స్ మీ నాన్న ప‌రువు తుస్సుమ‌నిపించావుగా అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతలో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలంటూ నిహారికను, నాగబాబు అడుగుతారు. దీనికి నిహారిక, ఈ అకౌంట్ డీటైల్స్ అవసరంలేదని, ఐసీఐసీఐ మొబైల్ బ్యాంకింగ్ గురించి ఇద్దరూ ప్రమోట్ చేశారు. ఈ ప్రకటన ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. నిహారిక, చైతన్యను పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే.

రాజస్థాన్ లో నిహారిక, చైతన్యల పెళ్ళిని ఎంతో గ్రాండ్ గా జరిపించారు నాగబాబు. అలాగే తన కెరీర్ పరంగా కూడా ప్రణాళికలు రూపొందించుకుంటుంది. పెళ్ళి తర్వాత నిహారిక ఓ వెబ్ సిరీస్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే రీసెంట్ గా ఓ సినిమాకి కూడా సైన్ చేసిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.