ఇక్కడ కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..!
Samsthi 2210 - June 3, 2021 / 10:42 AM IST

Niharika ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా.. గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. పైగా పెద్దింటి అమ్మాయిలా ఉంది.. మీ ఊహలు కరెక్టే.. ఇక్కడ కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికైనా గుర్తు పట్టారా..? చెబితే నమ్మడం కాస్త కష్టమే. ఇక్కడ ఉన్న ఈ హీరోయిన్ ఎవరో కాదు నిహారిక కొణిదెల. సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయిలు మారిపోతారు అంటారు. కానీ మరీ గుర్తు కూడా పట్టకుండా మారిపోతారని నిహారికని చూస్తే అర్థమవుతుంది. ఈ ఫోటోలో ఉన్నది నిహారిక అని ఎవరో చెబితే కానీ గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.

Niharika Konidela
ఇక్కడ ఉన్నది మెగా డాటర్ అని తెలుసుకున్న తర్వాత అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అయ్యో నిహారికకు ఏమైంది.. ఇలా అయిపోయింది.. మరి ఇంతగా మారిపోయింది ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు. కాస్త ఓవర్ మేకప్ తో గుర్తు పట్టడం కష్టమైపోయింది. మరి తీక్షణంగా చూస్తే కానీ అక్కడ ఉన్న నిహారిక అని గుర్తించడం కష్టం. తాజాగా చేసిన ఫోటో షూట్ లో భాగంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది నిహారిక.
2020 డిసెంబర్లో చైతన్య జొన్నలగడ్డతో ఏడడుగులు నడిచిన నిహారిక.. మాల్దీవ్స్ వెళ్లి హనీమూన్ జరుపుకుని వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాలతో బిజీ అయిపోయింది నిహారిక. దాంతో పాటు ఎప్పట్లాగే సోషల్ మీడియాలోనూ అభిమానులతో ముచ్చటిస్తుంది. వాళ్ల కోసం సమయం కేటాయిస్తూ అత్తగారింటి సంగతులు కూడా వాళ్ళతో పంచుకుంటుంది. ఏదేమైనా కూడా నిహారిక కొత్త ఫొటోస్ మాత్రం అభిమానులకు ఓ రేంజ్ లో షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నిహారిక వెబ్ సిరీస్ చేస్తుంది. ఇందులో అందాల ముద్దుగుమ్మ అనసూయ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.