Niharika Konidela : గ్లామరస్ లుక్స్‌తో కేక పెట్టిస్తున్న నిహారిక
NQ Staff - June 26, 2022 / 08:52 PM IST

Niharika Konidela : మెగా బ్రదర్ ముద్దుల కూతురు నిహారిక డిజిటల్‌లోను రాణిస్తూనే కొన్ని చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ అదుర్స్ అనిపించింది. ఇక ఈమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసింది.ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌ల విషయంలో సైలెంట్ మెయింటెన్ చేస్తోన్న ఈ భామ రీసెంట్‌గా ఉగాది రోజున హైదరాబాద్‌లో జరిగిన రేవ్ పార్టీతో మరోసారి వార్తల్లో నిలిచింది.

Niharika Konidela new cute photos
అందం అదుర్స్..
పబ్ ఇన్సిడెంట్ తర్వాత కాస్త సైలెంట్ అయిన నిహారిక మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. 2020 డిసెంబర్ లో నిహారిక వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధం జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఆమె వివాహం ఘనంగా నిర్వహించారు. పెళ్ళైనా హీరోయిన్ గా ఎదగాలనే ఆమె కోరిక చావలేదు.
భర్త, అత్తింటివారి అనుమతితో నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. దీని కోసమే ఆమె స్టైలిష్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. నిహారిక ఇంస్టాగ్రామ్ లో వరుస ఫోటో షూట్స్ చేయడంతో పాటు సదరు ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఆ విధంగా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ మధ్య నిహారిక తన అకౌంట్ ని డియాక్టివేట్ చేసింది. దాదాపు ఓ నెల రోజుల తర్వాత తిరిగి అకౌంట్ చలామణిలోకి తెచ్చింది. ఇక అప్పటి నుండి తెగ హడావిడి చేస్తుంది. కేక పెట్టించే అందాలతో కుర్రకారుని తనవైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా నిహారిక క్యూట్ లుక్ లో మెరిసింది.
నటిగా ఎదగాలి అనేది ఆమె అసలు కోరిక. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఈ మధ్య నిహారిక కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. లేట్ నైట్ పార్టీలో నిహారిక పాల్గొన్నారు. ఆమె పార్టీ జరుపుకుంటున్న పబ్ పై పోలీసులు దాడి చేసి 50 మంది యువతీయువకులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. వాళ్లలో నిహారిక కూడా ఉన్నారు. నిహారికకు మాత్రం క్లీన్ చిట్ వచ్చింది.