Niharika Konidela : మెగా హీరోతో నిహారిక చిన్న పిల్ల‌లా ర‌చ్చ చేసిందిగా..వీడియో చ‌క్క‌ర్లు

Niharika Konidela : ఉప్పెన సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్. తొలి సినిమాతో మంచి హిట్ కొట్టిన వైష్ణ‌వ్ తేజ్ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. చిన్న సినిమాగా విడుదలై స్టార్ హీరో సినిమా రేంజ్ వసూళ్లు సాధించింది ఉప్పెన‌. దాదాపు రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టిన ఉప్పెన చిత్రం 2021 హైయెస్ట్ గ్రాసర్స్ లో టాప్ 5లో నిలిచింది. భారీ లాభాలు తెచ్చి పెట్టిన ఉప్పెన కోవిడ్ సంక్షోభం తర్వాత పరిశ్రమకు శోభ తీసుకొచ్చింది.

Niharika Konidela Making FUN On Vaisshnav Tej
Niharika Konidela Making FUN On Vaisshnav Tej

అయితే వైష్ణవ్ రెండవ చిత్రం కొండపొలం పూర్తిగా నిరాశపరిచింది. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన కొండపొలం మూవీ అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. రకుల్ హీరోయిన్ గా నటించిన కొండపొలం వైష్ణవ్ కి బిగ్ షాక్ ఇవ్వగా.. మూడో చిత్రంతో మరో భారీ హిట్ కొట్టాలని వైష్ణవ్ కృత నిశ్చయంతో ఉన్నాడు.

1990 జనవరి 13న జన్మించిన వైష్ణవ్ తేజ్ నేడు 32వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కొత్త మూవీ ప్రకటన చేశారు. వైష్ణవ్ బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. పవన్ కళ్యాణ్ జానీ, చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్, అందరివాడు చిత్రాలలో వైష్ణవ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ చేశారు. వైష్ణవ్ అన్న సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే హీరోగా పరిశ్రమలో చోటు సంపాదించుకున్నారు

వైష్ణ‌వ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అతడికి మెగా ఫ్యాన్స్‌ నుంచి సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అంతేగాక వైష్ణవ్‌ బర్త్‌డే సందర్భంగా అతడి కొత్త ప్రాజెక్ట్స్‌ను ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌ ఇస్తున్నారు మేకర్స్‌. మెగా డాటర్‌ నిహారిక వైష్ణవ్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

క్యూట్‌ వీడియోను షేర్‌ చేస్తూ ఈ మెగా మేనల్లుడికి విషెస్‌ చెప్పింది. ఈ వీడియోలో నిహారిక, వైష్ణవ్‌లు చిన్న పిల్లల్లా కొట్టకుంటూ కనిపించారు. పిల్లలు ఆడుకునే ప్లెయింగ్‌ నెట్‌లో కూర్చుని బాల్స్‌తో వీరిద్దరూ కొట్టుకుంటున్న వీడియోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీనికి ‘ఈ వీడియో మన ఇద్దరి మధ్య బాండింగ్‌ను ఈ వీడియో నిర్వచిస్తుంది(ఎప్పుడు గొడవ పడుతూ, పక్కవారికి ఇబ్బంది లేకుండా సైలెంట్‌ జోక్స్‌తో మా వెర్రిలో మేముంటాం). మాటల కంటే చర్యలు పెద్దవి అనడానికి ఇది ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.