Niharika: కొడుకు పెద్దవాడవుతున్నాడని మురిసిపోతున్న నిహారిక!!

Niharika నిహారిక.. కొణిదెల వారి వారసురాలు. అంతేకాదు మెగా ఫ్యామిలీ నుండి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్. తన అల్లరి, మాటలు, ఆటలతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. తెలుగులో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. మెగా ఫ్యామిలీ హీరోలకు ముద్దుల చెల్లెలుగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. నిహారికా తన తండ్రి నాగబాబు ముద్దుల కూతురుగా అంతులేని ప్రేమను, అభిమానాన్ని పెంచుకుంది. సిల్వర్ స్క్రీన్, డిజిటల్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో పాపులారిటీ సాధించారు.

Niharika

అయితే తన పెళ్ళికి ముందు సోషల్ మీడియాలో తాను చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆమె అభిమానులు కూడా నిహారిక చేసే అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. లాక్ డౌన్ లో ఎంతో బోరింగ్ ఫీల్ అవుతున్నానంటూ వంటింట్లోకి వెళ్ళి మంచి రెసిపీలను, అభిమానులతో షేర్ చేసుకున్నారు. అంతేకాదు తన స్టైలీష్ డ్రెస్సింగ్ ను అమ్మాయిలకు నేర్పిస్తున్నారు. ఓ పక్క పద్దతిగా ఉంటూనే, స్టైల్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పేస్తున్నారు. వీటికి సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అలా నిహారిక సోషల్ మీడియాతో తన అభిమానుల్ని ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేస్తూనే ఉంది.

Niharika Konidela

చైతన్య జొన్నలగడ్డను పెళ్ళి చేసుకున్నాక, నిహారిక మొదటి పుట్టినరోజు సందర్భంగా మెమరబుల్ గిఫ్ట్ ని ఇచ్చారు చైతన్య. అది కూడా నిహారికకు ఎంతో ఇష్టమైన పెట్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ పెట్ ను నిహారిక తన కొడుకుగా బావిస్తూ.. ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. దానికి బజ్ అనే పేరును పెట్టుకుని ఎంతో ముద్దుగా పెంచుకుంటుంది. ఇంకా సోషల్ మీడియాలో కూడా తన పెట్ తో గడిపే సమయాన్ని, దానితో ఎలా ఉంటుందో కూడా చెబుతుంటుంది. ఈ క్రమంలోనే తన బేబి బాయ్ పెద్దవాడవుతున్నాడంటూ తెగ మురిసిపోతున్నారు. దీనికి సంబంధించి ఓ ఫోటోను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ హల్ చల్ అవుతుంది.