Niharika : స్టైలిష్‌గా రెడీ అయి స‌ర్‌ప్రైజ్ చేసిన నిహారిక‌.. ఆక‌ట్టుకుంటున్న పిక్స్

Niharika : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక ఎప్పుడు అంద‌రి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. వివాహం తర్వాత వెండి తెరకు దూరమైన నిహారిక ఇప్పుడు నిర్మాతగా బిజీగా మారేందుకు బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే జీ5 ఓటీటీ కోసం ఓ వెబ్‌ సిరీస్‌కు నిర్మాతగా మారింది నిహారిక.

‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ విషయానికొస్తే 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి.

రీసెంట్‌గా ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి హాజ‌రైన నిహారిక ప‌లు విష‌యాల‌పై మాట్లాడి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ అమ్మ‌డి క్యూట్ ముచ్చ‌ట్ల‌కు తెగ మురిసిసోయారు అభిమానులు.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గ ఉండే నిహారిక అప్పుడ‌ప్పుడు అదిరిపోయే పిక్స్ షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో మ‌తులు పోగొడుతూ పిచ్చెక్కిస్తుంది. ఆమె పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

మెగా డాటర్ నిహారిక ఏది చేసినా దాంట్లో ఎంతో కొంత వెరైటీ అయితే ఉంటుందని చాలా సందర్భాల్లో చూశాం. సినిమాలు, వెబ్ సిరీస్ ఇలా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే పెళ్లి పీటలెక్కేసింది మెగా డాటర్. మెగా సందడి నడుమ అంగరంగ వైభవంగా చైతన్యను పెళ్లాడిన ఆమె, ప్రస్తుతం అత్తారింట ఉంటోంది. అయితే తన రెగ్యులర్ హ్యాబిట్ మాత్రం అస్సలు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.