Niharika: బావ వ‌రుస అయిన బ‌న్నీని నిహారిక అన్న‌య్య అని ఎందుకు పిలుస్తుందో తెలుసా?

Niharika: మెగా ప్రిన్స్ నిహారిక తాజాగా ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాగా, ఈ కార్య‌క్ర‌మంలో నిహారిక ఆస‌క్తిక‌ర విషయాలు వెల్ల‌డించింది. అలీ గమ్మత్తైన ప్రశ్నలు.. నిహారిక చిలిపి సమాధానాలతో ఈ ఎపిసోడ్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. నిహారిక ఎంట్రీకి ‘నిహారికా నిహారికా నువ్వే..’ సాంగ్‌ని వేయడంతో.. ఈ పాట నువ్వు పుట్టున తరువాత రాశారంటావా? లేక నిన్ను చూసిన తరువాత పాడారంటావా? అంటూ అలీ పంచ్ వేసాడు.

TheNewsQube-
niharika comments on allu arjun2
niharika comments on allu arjun2

‘ఏమో కానీ.. దేవి శ్రీ ప్రసాద్ గారు నా కోసమే ఈ పాట రాశారని నేనైతే ఫిక్స్ అయిపోయా. ఏ షోకి వెళ్లినా ఈ పాట తమన్నాకి కూడా ప్లే చేస్తారో ఏమో కానీ.. నాకైతే ఇదే పాట వేస్తారు అని చెప్పింది నిహారిక. ఇంతకీ నువ్ ఏమౌతావ్ అని చిన్నప్పుడు అనుకున్నావ్ అని నిహారికను అడిగితే.. ‘ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా టీచర్ అవుదాం అనుకున్నా.. ఆ తరువాత నిర్ణయాలు మారుతూ వచ్చాయి.

ఏడో తరగతి నుంచి డాక్టర్ అవుదాం అని ఫిక్స్ అయ్యా.. కోసేద్దాం అనుకున్నా. తీరా ఇంటర్‌కి వచ్చిన తరువాత బైపీసీ తీసుకుందాం అనుకునే సరికి బైపీసీలో పీ అంటే ఏంటి ఫిజిక్స్‌నా అని అడిగా.. అవును అనడంతో వామ్మో నాకు ఫిజిక్స్ అంటే భయం అని చెప్పి డ్రాప్ అయిపోయా అని చెప్పా.

ఇక తన ఫ్యామిలీలో ఇష్టాఇష్టాల గురించి చెప్పుకుంటూ తన నాన్నతరువాతే ఎవరైనా అని అన్నది. ఈ సందర్భంలో నాకు, సాయి ధరమ్ తేజ్, చిన్న అత్త, మానాన్న.. మా నలుగురికి కొంచెం మెంటర్ ఉందని చెప్పింది నిహారిక. ఆ మాటకి అలీ ఎక్స్ ప్రెషన్స్ హైలైట్ అనే చెప్పాలి.

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మామయ్య కొడుకే అయినా.. బన్నీని అన్న అని పిలుస్తుంటా అని నిహారిక చెప్పింది. బన్నీ నటించిన ప్రతి సినిమాలో ఓ వైవిద్యం ఉంటుందని, ఆయన నటించిన అన్ని సినిమాల ఫొటోస్ ఒక్కచోట పెడితే.. ఏది ఏ సినిమాలోదో చెప్పేస్తా అని ఆమె తెలిపింది. సినిమాల్లో లుక్‌ పరంగా బన్నీ చాలా కేర్ తీసుకుంటారని, జులాయి సినిమాలో బన్నీ అన్న అంటే ఇష్టమని నిహారిక చెప్పుకొచ్చింది.

niharika comments on allu arjun
niharika comments on allu arjun

కొణిదెల, అల్లు కుటుంబం కాకుండా ఏ హీరో ఇష్టం అని ఆలీ వేసిన ప్రశ్నకు రవితేజ, నాగార్జున అని సమాధానమిచ్చింది నిహారిక. ఇకపోతే పెళ్లి తర్వాత సినీ కెరీర్ కంటిన్యూ చేస్తున్న ఈ మెగా డాటర్ రీసెంట్‌గా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తెచ్చి పలువురి మన్ననలు అందుకుంది.