Mahesh babu : మహేష్ బాబుతో నిధి అగర్వాల్ ..!

Vedha - May 25, 2021 / 08:48 AM IST

Mahesh babu : మహేష్ బాబుతో నిధి అగర్వాల్ ..!

Mahesh babu : మహేష్ బాబుతో నిధి అగర్వాల్ నటించబోతుందా…అవుననే మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలలోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇది దాదాపు నిజమనే మాట గట్టిగా వినిపిస్తోంది. అందుకు కారణాలు కూడా కరెక్ట్‌గానే ఉన్నాయి. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మున్నా మైఖేల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ అక్కడ మొదటి సినిమాతో గుర్తింపు రాగానే టాలీవుడ్‌లో అక్కినేని సోదరులతో నటించే అవకాశాలు అందుకుంది.

nidhiagarwal with mahesh-babu

nidhiagarwal with mahesh-babu

నాగ చైతన్య సరసన సవ్యసాచి, అఖిల్ సరసన మిస్టర్ మజ్ఞు సినిమాలు చేసిన నిధి ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌తో భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో రెండు సూపర్ హిట్స్ అందుకున్న నిధి చేతిలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లులో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా సెటిలవడం ఖాయమని అందరూ ఫిక్సైపోయారు. శృతి హాసన్ మాదిరిగా సౌత్‌లో నిధి స్టేటస్ అందుకుంటుందని నమ్మకంగా ఉన్నారు.

Mahesh babu : మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ అంటే ఇక నిధి లైఫ్ సెట్టైనట్టే.

కాగా నిధికి మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక హీరోయిన్‌గా పూజా హెగ్డే మరొక హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించబోతుందట. త్రివిక్రమ్ సినిమాలో ఒకసారి నటించిన హీరోయిన్‌కి వరసగా ఆ తర్వాత సినిమాలలోనూ అవకాశాలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో వారు స్టార్ హీరోయిన్స్‌గా సెటిలవుతున్నారు. అటు పవర్ స్టార్ సినిమా ఇటు త్రివిక్రమ్ – మహేష్ సినిమాలో ఛాన్స్ అంటే ఇక నిధి లైఫ్ సెట్టైనట్టే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us