Nidhi agarwal : అప్పుడు నిధి అగర్వాల్ ఇప్పుడు పూజా హెగ్డే..!
Vedha - May 20, 2021 / 09:40 PM IST

Nidhi agarwal : నిధి అగర్వాల్ బాలీవుడ్‌లో ‘మున్నా మైఖేల్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో టాలీవుడ్‌లో హీరోయిన్ అవకాశం దక్కింది. అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఈ సినిమా హిట్ కాకపోవడంతో స్టార్ హీరోయిన్ అనే మాటకు కాస్త దూరంగా ఉంది. అయినా వెంటనే అక్కినేని అఖిల్ సరసన ‘మిస్టర్ మజ్ఞు’ సినిమా చేసే అవకాశం అందుకుంది.

Nidhi Agarwal before is now Pooja Hegde ..!
ఈ సినిమా కూడా నిధికి హిట్ ఇవ్వలేదు. కానీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో స్టార్ హీరోయిన్‌గా మారింది. కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి రెండు హిట్స్ అందుకుంది. తెలుగులో పాన్ ఇండియన్ సినిమా ‘హరిహర వీరమల్లు’లో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే నిధి పాన్ ఇండియన్ హీరోయిన్‌గా సెటిలవుతుంది.
Nidhi agarwal : నిధి అగర్వాల్ కి బాలీవుడ్‌లో ఇప్పటికీ క్రేజ్ ఉంది.
అయితే బాలీవుడ్‌లో నిధికి ఇప్పటికీ క్రేజ్ ఉంది. డెబ్యూ సినిమా తర్వాత అందరూ ‘గోల్డెన్ గర్ల్’ అని పిలిచారు. ఇప్పుడు అలాగే పూజా హెహ్డేని పిలుస్తున్నారు. ‘మొహంజాదారో’, ‘హౌజ్‌ఫుల్ 4’లో నటించిన పూజా ప్రస్తుతం సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్‌లతో రెండు క్రేజీ సినిమాలు చేస్తోంది. ఈ క్రేజ్‌తోనే పూజాను ‘గోల్డెన్ గర్ల్’ అంటున్నారట. ఇక పూజా హెగ్డే తెలుగుతో పాటు కోలీవుడ్‌లోనూ క్రేజీ మూవీస్ చేస్తోంది. రెమ్యునరేషన్ కూడా భారీగా అందుకుంటోంది.