Nidhhi Agerwal: నార్త్‌లోను ఇస్మార్ట్ బ్యూటీ హ‌వా ఓ రేంజ్‌లోనే ఉంది మ‌రి..!

Nidhhi Agerwal: మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో సినీ కెరీర్‌ని ప్రారంభించి స‌వ్య‌సాచి చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిధి అగ‌ర్వాల్‌. మున్నా మైఖేల్ చిత్రానికి గాను ఈ అమ్మ‌డు జీ సినీ అవార్డ్ గెలుచుకుంది. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న నిధి అగ‌ర్వాల్.. క్రిష్ తెర‌కెక్కిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించే ఆఫ‌ర్ అందుకుంది. యంగ్ హీరో అశోక్ గల్లా స‌ర‌స‌న కూడా ఓ చిత్రం చేస్తుంది.

Nidhhi Agerwal

చిన్న‌ప్ప‌టి నుండి గ్లామ‌ర్ ఫీల్డ్‌పైన ఎక్కువ ఆసక్తి చూపించిన నిధి అగ‌ర్వాల్ ఎక్క‌డైన ఐశ్వ‌ర్య‌రాయ్ హోర్డింగ్ క‌నిపిస్తే, తాను కూడా ఏదో ఒక రోజు అలా మార‌తాను అని మ‌న‌సులో అనుకునేద‌ట‌. సినిమా ఛాన్స్ రాగానే త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది నిధి అగ‌ర్వాల్. సవ్యసాచి’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన నిధి అగ‌ర్వాల్ ఆ మూవీ కూడా ప్లాప్ అవ్వడంతో అమ్మడు గ్యాప్ తీసుకొని మరీ ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేసింది.

నిధి చేస్తున్న సినిమాలన్నీ బోల్తా కొట్టడంతో ఏం చేయాలో తెలియక కొంత గ్యాప్ తీసుకున్న నిధి అగ‌ర్వాల్‌కి ఇస్మార్ట్ శంక‌ర్ రూపంలో మంచి హిట్ ద‌క్కింది. ఈ సినిమాలో మొత్తంగా అందాలు ఆరబోసి మొదటి హిట్ అందుకుంది. అలానే ఈ సినిమాతో తెలుగు యువతకు అమ్మడు గ్లామర్ క్వీన్ అయిపోయింది. తెలుగులోనే కాదు త‌మిళంలోను నిధి అగ‌ర్వాల్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆమెకు గుడులు క‌ట్టి పూజ‌లు చేస్తున్నారు. ఇప్పుడు హిందీలోను ఇస్మార్ట్ బ్యూటీ హీరోల‌కు ధీటుగా రికార్డులు న‌మోదు చేస్తుంది.

Nidhhi Agerwal

ఈ మధ్యకాలంలో తెలుగులో ఫెయిల్ అయినటువంటి సినిమాలు యూట్యూబ్ లో హిందీ వెర్షన్ కోట్లలో వ్యూస్ తెచ్చుకొని మిలియన్స్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. నిధి నటించిన ఫస్ట్ మూవీ సవ్యసాచి 130మిలియన్స్ క్రాస్ చేయగా.. ఇక మిస్టర్ మజ్ను మూవీ 200 మిలియన్స్ కాగా.. నిధి ఫస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్ మూవీ ఏకంగా 202 మిలియన్స్ క్రాస్ చేసి ముందంజలో ఉంది. హీరోల‌కు ధీటుగా నిధి అగ‌ర్వాల్ హ‌వా న‌డుస్తుంద‌నే చెప్పాలి. చూస్తుంటే రానున్న రోజుల‌లో ఇస్మార్ట్ బ్యూటీ సినీ ఇండ‌స్ట్రీను ఏలేలా కనిపిస్తుంది.