Nidhhi Agerwal: పేరుకి మాత్రం చిన్న హీరోయిన్.. మ‌న‌సు మాత్రం చాలా పెద్దది

2017లో మున్నా మైకేల్ బాలీవుడ్ ఫిల్మ్​ ద్వారా ఫేమ్​ అయిన నిధి అగర్వాల్​, తెలుగు, తమిళ, హిందీ భాష‌ల‌లో ప‌లు సినిమాలు చేసింది. ఇటీవ‌ల వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ నిధి అగ‌ర్వాల్ క్రేజ్‌ని మరింత పెంచింది. త‌మిళంలోను ఈ అమ్మ‌డికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ మ‌ధ్య కోలీవుడ్​ అభిమానులు ఈ అమ్మ‌డికి ఏకంగా ఓ గుడి కట్టడం విశేషం. కాగా, ప్రస్తుతం క్రిష్​ డైరెక్షన్​లో పవన్​ కళ్యాణ్​ హీరోగా ‘హరిహరవీరమల్లు’లో నిధి హీరోయిన్​గా నటిస్తోంది.


సెకండ్ వేవ్ ప్రమాద తీవ్రతను చూశాక సెలబ్రిటీలు మరోసారి అలెర్టయ్యారు. తమవంతుగా కోవిడ్ బాధితులకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఎవ‌రికి చేత‌నంత సాయం వారు చేస్తుండ‌గా, నిధి అగ‌ర్వాల్ కూడా పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ఉన్నారు. రకుల్ ప్రీత్ ఇటీవలే తాను చిన్న మొత్తాలను సేకరించి ఆ నిధితో బ్యాంక్ ను ఏర్పాటు చేసి ఆప‌ద‌లో ఉన్న‌వారికి సాయం చేస్తానంది. షామా శికందర్ వంటి తారలు ఇదే బాటలో సాయానికి ముందుకొచ్చారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ ఫేం నిధి అగర్వాల్ `డిస్ట్రిబ్యూట్ లవ్` అనే నిధి సేకరణ సంస్థను ప్రారంభించనున్నారు. త‌మ వెబ్ సైట్ ద్వారా వచ్చే ప్రతి అభ్యర్థనను పరిశీలించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసామని చెప్పిన నిధి అవ‌స‌ర‌మైన వారికి మందులు లేదా ఆహారం వగైరా ఏవైనా ఇస్తాం అని పేర్కొంది.