ACCIDENT: స్టార్ హీరోయిన్ భ‌ర్త‌కు ప్ర‌మాదం.. వెంట‌నే అంబులెన్స్‌లో ఆసుప‌త్రికి త‌ర‌లింపు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు ప్రఖ్యాత‌లు సంపాందించుకున్న ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకొని లాస్ ఏంజెల్స్‌లో సెటిల్ అయింది. అక్క‌డి సినిమాలే చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం ప్రియాంక వయసు 38 ఏళ్లు కాగా, తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. రీసెంట్‌గా త‌న శ‌రీరాకృతి గురించి స్పందించింది ప్రియాంక‌. వయసు పెరుగుతున్న క్రమంలో నా శరీరంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులను మానసికంగా స్వీకరించేందుకు నాకు నేనుగా సిద్దమవుతున్నా. నా శరీరంలో వస్తున్న ఈ మార్పుల వల్ల నేను ఇబ్బంది పడటం లేదనే అబద్దాన్ని చెప్పలేను అని స్ప‌ష్టం చేసింది.

నిక్, ప్రియాంక వేరు వేరు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో నిక్ జోనాస్ లాస్ ఏంజెల్స్‌లో నివ‌సిస్తుండ‌గా, ప్రియాంక లండ‌న్‌లో ఉంటుంది. అయితే తాజాగా నిక్ జోనాస్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. వెంట‌నే అత‌నిని అంబులెన్స్ లో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు పెద్ద ప్ర‌మాదం ఏమి జ‌ర‌గ‌లేద‌ని తేల్చిన త‌ర్వాత ఆదివారం డిశ్చార్జ్ చేశారు. ఈ రోజు రియాలిటీ షో ‘ది వాయిస్’లో పాల్గొన‌బోతున్నాడు నిక్ జోనాస్. అంద‌రి ప్రేమ‌, ఆశీర్వాదం వ‌ల‌న త‌న‌కు ఏం జ‌ర‌గ‌లేద‌ని అంటున్నారు నిక్.